Premakumar Gunaratnam : పోరాటానికి దర్పణం ‘గుణరత్నం’
ఎందుకు అతడిని చంపాలనుకున్నారు
Premakumar Gunaratnam : శ్రీలంక గత కొంత కాలం నుంచీ అట్టుడుకుతోంది. ఎల్టీటీఈని దారుణంగా మట్టుబెట్టాక ఎక్కువ కాలం ప్రేమకుమార్ గుణరత్నం పేరు వినిపించింది.
దీనికి కారణం ఆయన ప్రజల కోసం పని చేయడమే. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే గుణరత్నం 18 నవంబర్ 1965లో పుట్టాడు.
అతడి వయస్సు 56 ఏళ్లు. శ్రీలంకలో మాజీ జేవీపీ నాయకుడు. రాజకీయ కార్యకర్త. ఎఫ్ఎల్ఎస్పీ ప్రధాన కార్యదర్శి. పిన్నవాలా సెంట్రల్ కాలేజీలో చదివాడు .
యూనివర్శిటీ ఆఫ్ పెరాదేనియా ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రవేశించాడు. యూనివర్శిటీలో చేరిన కొద్ది కాలానికే విద్యార్థి నాయకుడు అయ్యాడు. ఆస్ట్రేలియాలో ఉంటున్న సింహళీయ డాక్టర్ చంపా సోమరత్నను పెళ్లి చేసుకున్నాడు.
1988 -89 లో గుణరత్నం దేశ ప్రేమి జనతా వ్యాపారయ (డీజేవీ) ట్రింకోమలీ నాయకుడిగా పని చేశాడు. జేవీపీ, మార్క్సిస్ట్ ధోరణి తమిళ సమూహాల మధ్య సంప్రదింపుల పాయింట్ గా ఉన్నాడు గుణరత్నం.
పేలుడు పదార్థాల నిపుణుడిగా పేరొందాడు. పల్లెకెల సైనిక శిబిరంపై జేవీపీ దాడి , అనేక ఇతర దాడులకు సూత్రధారిగా ఉన్నాడు. జోగంబర జైలులో బంధించబడ్డాడు.
13 డిసెంబర్ 1988న జైలు నుండి బయటకు వచ్చే మార్గంలో సొరంగం ద్వారా తప్పించుకున్నాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు. సైన్యం వేట ప్రారంభించడంతో సముద్ర మార్గం ద్వారా వెళ్లి పోయాడు.
ఒక రకంగా చెప్పాలంటే గుణరత్నం అంతు చిక్కని నాయకుడు. జేవీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రేమకుమార్ గుణరత్నం(Premakumar Gunaratnam) అని పిలుచుకుంటారు.
ఏప్రిల్ 2012లో హార్డ్ కోర్ సోషలిస్ట్ గుణరత్నం , పార్టీ నాయకుడు సోమవంశ అమరసింగ్ మధ్య పార్టీలో అంతర్గత సంక్షోభం వేడెక్కింది. మెజారిటీ సభ్యులు గుణరత్నంకకు మద్దతు తెలిపారు.
ఫ్రంట్ లైన్ సోషలిస్ట్ పార్టీ పేరుతో కొత్త మార్క్సిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. గుణరత్నం ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించారని , గుణరత్నంను బహిష్కరించినట్లు శ్రీలంక వెల్లడించింది.
పర్యాటక వీసాపై దేశానికి వచ్చాక ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు గుణరత్నం 2015లో అరెస్ట్ అయ్యాడు. 2 డిసెంబర్ 2016న విడుదలయ్యాడు. ఫిబ్రవరి 2017లో శ్రీలంక పౌరసత్వాన్ని పొందాడు.
శ్రీలంకలో సంక్షోభానికి , ఆందోళనలకు ప్రధాన కారణం గుణరత్నం అని భావిస్తున్నాయి రాజకీయ పక్షాలు. ఇదిలా ఉండగా కొలంబో సమీపంలోని అతడి ఇంటి నుండి సాయుధ దళాలు ఎక్కించుకున్నారు.
అసమ్మతి నాయకుడి పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా విడుదలైన గుణరత్నం(Premakumar Gunaratnam) మాట్లాడాడు. గోటబయ నిష్క్రమణ ప్రజాస్వామ్య విజయమన్నారు.
Also Read : తదుపరి శ్రీలంక అధ్యక్షుడిపై ఉత్కంఠ