Priyanka Gandhi Focus : ప్రియాంక సీరియస్ కాంగ్రెస్ పై ఫోకస్
తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది
Priyanka Gandhi Focus : ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతూ పార్టీని బతికించేందుకు నానా తంటాలు పడుతున్నారు. మరో వైపు పలు రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. నేతల మధ్య సమన్వయం కొరవడడం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. గత కొంత కాలంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది.
ఎప్పుడైతే టీడీపీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో ఆనాటిన ఉంచి రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య పొసగడం లేదు. ఆయనపై బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. మరికొందరు సంచలన కామెంట్స్ చేస్తూ పార్టీని వీడారు. వారిలో దాసోజు శ్రవణ్ కుమార్ , మర్రి శశి ధర్ రెడ్డి.
తాజాగా రేవంత్ రెడ్డిపై సీనియర్ నాయకులు, పార్టీ పదవులలో కొనసాగుతున్న వారు మూకుమ్మడిగా ధిక్కార స్వరం వినిపించారు. వారిలో మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజ నర్శింహ్మ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధు యాష్కి గౌడ్ ఉన్నారు. వారంతా పార్టీలో ఒరిజనల్స్ వలస నేతల మధ్య ఇబ్బంది ఏర్పడిందంటూ బాహాటంగానే మండిపడ్డారు.
దీనికంతటికీ కారణం తాజాగా ఏఐసీసీ ఓకే చెప్పిన రెండు కమిటీలు. వీటిలో వలస వచ్చిన టీడీపీ వారికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారంటూ ఆరోపించారు. దీనిపై టీడీపీ నుంచి వచ్చిన 13 మంది తమకు పదవులే వద్దంటూ రాజీనామాలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ సీనియర్ల వర్గంగా తయారైంది.
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆధిపత్య పోరు మంచిది కాదని త్వరలోనే సర్దు కుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదిలా ఉండగా వచ్చే జనవరి 26 నుంచి ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు. దీంతో పార్టీ పట్టు తప్పుతుందని గ్రహించిన ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఈ మేరకు సీనియర్లతో ఆరా తీసినట్లు సమాచారం.
ఈ మేరకు ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ కు ఫోన్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న సమయంలో ఇలాంటివి కొనసాగుతుండడం పార్టీని నమ్ముకున్న క్యాడర్ పై ఎక్కువగా ప్రభావం చూపనుంది.
ఇకనైనా బయట పడకుండా కలిసికట్టుగా కృషి చేస్తే కనీసం పవర్ లోకి రాక పోయినా ప్రతిపక్షంలోనైనా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. మరి మేడం ఏం చేస్తారో చూడాలి.
Also Read : సమాజ సేవతోనే జీవితానికి సార్థకత