Prudhvi Joins in Janasena: జనసేనలో చేరిన నటుడు పృథ్వీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ !

జనసేనలో చేరిన నటుడు పృథ్వీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ !

Prudhvi Joins: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. అధికార పార్టీలోని అసంతృప్త నాయకులు, కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు తమ రాజకీయ ప్రస్తానం కోసం పార్టీలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువాను కప్పి వారిని సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న పృథ్వీ(Prudhvi)… పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత టీటీడీకు చెందిన ఎస్‌వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఓ మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అతడ్ని పార్టీ అధిష్టానం ఆ పదవి నుండి తొలగించింది. దీనితో ఆ వివాదం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ పార్టీకు రాజీనామా చేసారు. గత కొంతకాలంగా జనసేనకు సానుభూతి పరుడిగా ఉన్నారు. సినిమా రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే జానీ మాస్టర్… బుధవారం అఫీషియల్ గా పార్టీ సభ్యుడిగా మారారు.

Prudhvi Joins – పవన్ కళ్యాణ్ తో గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ ?

ఏపీలో అధికార వైసీపీలో అసంతృల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్… సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎడాపెడా మార్చుతుండటంతో టిక్కెట్టు ఆశించి భంగపడుతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీను వీడుతున్నారు. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి… వైసీపీను వీడి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్… పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం సంచలనంగా మారింది. గూడూరు వైసీపీ టికెట్‌ ను మేరుగ మురళికి కేటాయించడంతో… వరప్రసాద్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తో బుధవారం వరప్రసాద్ భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు సమాచారం.

Also Read : KTR Sensational Comments: సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!