CM Jagan on Congress: కాంగ్రెస్‌ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు !

కాంగ్రెస్‌ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు !

CM Jagan: కాంగ్రెస్ పార్టీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. తిరుపతి వేదికగా ప్రముఖ జాతీయ వార్తా ఛానెల్ ఇండియా టుడే నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జగన్(CM Jagan)… ప్రముఖ జర్నలిస్టు, ఎడ్యుకేషన్ సమ్మిట్ యాంకర్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీ సోదరి వైఎస్ షర్మిలను ఏపీపీసీసీ చీఫ్ గా నియమించడానికి గల కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారు ? వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీను విచ్ఛిన్నం చేయడానికే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించిందా ? అని రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ….

CM Jagan Comment

‘‘డర్టీ పాలిటిక్స్ కు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ అలవాటు. తమ రాజకీయ లబ్ధికోసమే ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా కాంగ్రెస్‌ పార్టీ విడదీసింది. కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి నేను బయటకు వచ్చిన తరువాత… నా కుటుంబం నుండి మా బాబాయిని మంత్రిని చేసి నాపై పోటీకు దించింది ప్రయోగించింది. ఇప్పుడు మళ్లీ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది. నా సోదరిని ఏపీ అధ్యక్షురాలిగా చేసి నాపై ప్రయోగిస్తోంది. విభజించి పాలించడమే ఆ పార్టీ నిత్య విధానం. కాంగ్రెస్‌ గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ఆ పార్టీకి మరోసారి దేవుడు గుణపాఠం చెబుతాడు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోయినా బాధపడను,’’ అని జగన్‌ వివరించారు. ప్రస్తుతం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గత రెండు రోజులుగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఏవిధంగా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: Prudhvi Joins in Janasena: జనసేనలో చేరిన నటుడు పృథ్వీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ !

Leave A Reply

Your Email Id will not be published!