PV Sindhu : సింగ‌పూర్ టైటిల్ గెలిచిన పీవీ సింధు

వాంగ్ ఝీ యి ని ఓడించిన స్టార్ షెట్ల‌ర్

PV Sindhu : భార‌త స్టార్ షెట్ల‌ర్ పీవీ సింధు సంచ‌ల‌నం సృష్టించింది. త‌న కెరీర్ లో మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఏకంగా సింగ‌పూర్ టైటిల్ ను గెలిచి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది.

సింగ‌పూర్ ఓపెన్ 2022 మొద‌టి సూప‌ర్ 500 టైటిల్ ను కైవ‌సం చేసుకుని చ‌రిత్ర సృష్టించింది. ఇదిలా ఉండ‌గా ఈ తెలుగు వారి అమ్మాయి ఈ ఏడాది సీజ‌న్ లో త‌న మూడో టైటిల్ ను గెలుచు కోవ‌డం విశేషం.

సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్ మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో ఆట సాగింది. మ‌హిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్ లో పీవీ సింధు(PV Sindhu) ఆదివారం చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-0, 11-21, 21-15 తేడాతో విజ‌యం సాధించింది.

ఒలింపిక్ ప‌త‌క విజేత రెండో గేమ్ కోల్పోయే ముందు మొద‌టి గేమ్ ను సాధించింది. త‌న తొలి సూప‌ర్ 500 టైటిల్ ను కైవ‌సం చేసుకుంది త‌న కెరీర్ లో అత్యుత్త‌మ ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది.

ఇదిలా ఉండ‌గా ఇద్ద‌రి మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ మ‌రింత ఉత్కంఠ భ‌రితంగా మారింది. చివ‌రి దాకా టెన్ష‌న్ నెల‌కొంది . ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై.

ఒక నొక ద‌శ‌లో ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి. కాగా అంత‌కు ముందు కేవ‌లం 32 నిమిషాల వ్య‌వ‌ధిలోనే సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో పీవీ సింధు జ‌పాన్ కు చెందిన సైనా క‌వాక‌మీని 21-15 , 21-7 తో ఓడించి స‌త్తా చాటింది.

సింగ‌పూర్ ఓపెన్ స‌య్య‌ద్ మోడీ ఇంట‌ర్నేష‌న‌ల్ , స్విస్ ఓపెన్ బీడ‌బ్లుఎఫ్ సూప‌ర్ 300 టైటిళ్ల‌ను గెలుచుకుంది పీవీ సింధు(PV Sindhu).

Also Read : లాంగ్ జంప్ లో ఫైన‌ల్ కు చేరిన శ్రీ‌శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!