Rachin Ravindra : సచిన్ రికార్డ్ రచిన్ బ్రేక్
వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్
Rachin Ravindra : బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023లో అరుదైన రికార్డులు నమోదవుతున్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది భారత దేశపు మూలాలు కలిగిన న్యూజిలాండ్ జట్టుకు చెందిన రచిన్ రవీంద్ర(Rachin Ravindra) టాప్ లో కొనసాగుతున్నాడు. అద్బుతంగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు.
Rachin Ravindra record Viral
23 ఏళ్ల అతి చిన్న వయసులో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు నమోదు చేశాడు. వరుస సెంచరీలతో ఔరా అనిపించాడు. పాతికేళ్ల లోపు ఒక ప్రపంచ కప్ లో భారీగా రన్స్ చేసిన ఏకైక ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు రచిన్ రవీంద్ర.
ఇప్పటి వరకు 565 పరుగులు చేశాడు. 1996లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో 523 రన్స్ చేశాడు భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ కెప్టెన్ సచిన్ రమేశ్ టెండూల్కర్. ఇదిలా ఉండగా శ్రీలంకకు చెందిన కుషాల్ పెరీరా అరుదైన ఘనత సాధించాడు. కేవలం 22 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించాడు.
ఇక న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తుండడంతో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసలు కురిపించారు.
Also Read : NZ vs SL ICC World Cup : గెలిచి నిలిచిన కివీస్