NZ vs SL ICC World Cup : గెలిచి నిలిచిన కివీస్

శ్రీ‌లంక‌కు వ‌రుస ఓట‌మి

NZ vs SL ICC World Cup : ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో శ్రీ‌లంక మ‌రోసారి ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఆ జ‌ట్టు ఇప్ప‌టికే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఇక సెమీస్ ఆశ‌లు సజీవంగా ఉంచుకుంది న్యూజిలాండ్ జ‌ట్టు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టీమ్ నాలుగు మ్యాచ్ ల‌లో ఓడి పోయింది.

NZ vs SL ICC World Cup Updates

సెమీ ఫైన‌ల్ లో నిల‌వాలంటే త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సిన మ్యాచ్ లో స‌మిష్టిగా రాణించింది కీవీస్. భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఈ కీల‌క పోరు లో మ‌రోసారి నిరాశ ప‌రిచింది శ్రీ‌లంక‌. ఏ కోశాన పోరాడలేదు . ఈ లీగ్ లో నాలుగో స్థానానికి చేరుకుంది.

టాస్ గెలిసిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక జ‌ట్టు 46.44 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ కు ఆలౌటైంది. కుషాల్ పెరీరా తో పాటు తీక్ష‌ణ మాత్ర‌మే ఆడారు. కుషాల్ 51 ర‌న్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు. తీక్ష‌ణ 38 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

మైదానంలోకి దిగిన కేవ‌లం 23 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 172 ర‌న్స్ చేశాడు. కాన్వే 45 , ర‌చిన్ ర‌వీంద్ర 42, మిషెల్ 43 ర‌న్స్ చేసి రాణించారు. మొత్తంగా టోర్నీలో న్యూజిలాండ్ ఆశ‌లు ఇంకా సజీవంగా ఉన్నాయి.

Also Read : Revanth Reddy : ఎర్ర‌బెల్లి వ‌ల్ల‌నే జైలుకు వెళ్లా

Leave A Reply

Your Email Id will not be published!