Rahul Gandhi Case Comment : రాహుల్ కేసేంటి దాని క‌థేంటి

ప‌రువు న‌ష్టం కేసులో బిగ్ షాక్

Rahul Gandhi Case Comment : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాట్ టాపిక్ గా మారారు దేశ వ్యాప్తంగా. కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది గుజ‌రాత్ హైకోర్టు ప‌రువు న‌ష్టం దావా కేసులో. ఇప్ప‌టికే సూర‌త్ కోర్టు ఇచ్చిన తీర్పు స‌రైన‌దేన‌ని అభిప్రాయ ప‌డింది ధ‌ర్మాస‌నం. ఇంతటి చ‌ర్చ‌కు దారి తీసిన రాహుల్ కు సంబంధించిన కేసు క‌థేంటో త‌ప్ప‌నిస‌రిగా తెలుసు కోవాల్సిందే. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌యంలో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన స‌భ‌లో రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. ప్ర‌ధాని మోదీని ఉద్దేశించి దొంగ‌లంద‌రికీ మోదీ అనే పేరు ఎందుకు ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. ఆ కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. కావాలని ప్ర‌ధానిపై రాహుల్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఆ స‌మ‌యంలో ట్రోల్ చేసింది. ఇదే స‌మ‌యంలో ఆర్ఎస్ ఎస్ ఫౌండ‌ర్ హేడ్గే వార్ పై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాహుల్ గాంధీ. మరో సారి మోదీ పేరు క‌లిగిన వారంతా ఆర్థిక నేర‌స్థులేనంటూ కామెంట్స్ చేయ‌డం అగ్నికి ఆజ్యం పోసేలా చేశాయి. కాంగ్రెస్ అగ్ర నేత‌పై కాషాయ శ్రేణులు భ‌గ్గుమన్నాయి. ఆనాటి నుంచి నేటి దాకా రాహుల్ ను టార్గెట్ చేస్తూ వ‌చ్చాయి.

దీనిని నిర‌సిస్తూ గుజ‌రాత్ రాష్ట్రంలోని సూర‌త్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు గాను బేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించింది దాఖ‌లు చేసిన దావాలో. ఈ కేసును విచారించింది కింది స్థాయి సూర‌త్ లోని సెష‌న్స్ కోర్టు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. మార్చి 23న తీర్పు చెప్పింది. రెండు సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించింది. ఆ వెంట‌నే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వాయ‌నాడు ఎంపీ నుంచి అన‌ర్హ‌త వేటుకు గుర‌య్యారు. శిక్ష ప‌డిన వ్య‌క్తి ఎంపీగా ఉండ కూడ‌దంటూ స్పీక‌ర్ ఓం బిర్లా పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌క‌ట‌న చేశారు. ఎంపీగా రాహుల్ అన‌ర్హుడంటూ ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ప్ర‌భుత్వ ప‌రంగా ఉంటున్న అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ పార్ల‌మెంట్ క‌మిటీ సిఫార‌సు చేసింది. ఈ మేర‌కు రాహుల్ ఇంటికి నోటీసులు జారీ చేశారు. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక రాహుల్ గాంధీ(Rahul Gandhi) సామాన్ల‌తో త‌న త‌ల్లి ఇంటికి వెళ్లారు.

ఇక ప‌రువు న‌ష్టం కేసుకు సంబంధించి కింది కోర్టు సూర‌త్ ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు విధించిన శిక్ష‌ను ఖ‌రారు చేయ‌కుండా స్టే ఇవ్వాల‌ని కోరారు. దీనికి కోర్టు కొంత స‌మ‌యం ఇచ్చింది. ఇదే కేసును గుజ‌రాత్ హైకోర్టు ధ‌ర్మాస‌నం విచారించింది. అంతిమ తీర్పు వెలువ‌రిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సూర‌త్ కోర్టు ఇచ్చిన తీర్పు స‌రైన‌దేన‌ని పేర్కొంది. దీనిపై అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టులో స‌వాల్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది కాంగ్రెస్ పార్టీ. ఇక రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కావాల‌ని మోదీ స‌ర్కార్ టార్గెట్ చేస్తోందంటూ విప‌క్షాలు మండిప‌డ్డాయి. మొత్తంగా రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గాంధీ బ‌రిలో ఉంటారా లేక జైలులో ఉంటారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : PM Modi Tour : ఓరుగ‌ల్లుకు రానున్న మోదీ

Leave A Reply

Your Email Id will not be published!