Rahul Gandhi Comment : ‘రాహుల్’ పప్పు కాదు ఫైర్
కాంగ్రెస్ అతడే సేనాని
Rahul Gandhi Comment : నిన్నటి దాకా రాహుల్ గాంధీని విమర్శించిన వాళ్లు ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. కొందరు పుట్టుకతో నాయకులు అవుతారు. మరికొందరు వంశ పారంపర్యంగా రాటు దేలుతారు. ఇంకొందరు నేతలుగా తయారు చేయబడతారు. కానీ కొందరు మాత్రం జనంలోంచి పుట్టుకు వస్తారు. అలాంటి వాళ్లను ఎవరూ ఆపలేరు. ఇది పక్కన పెడితే ఇపుడు హాట్ టాపిక్ గా మారారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన పదే పదే భారత దేశం , జాతీయ వాదం, కులం, మతం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మోదీ మీడియా, రాజ్యాంగం ఇలా ప్రతి దాని గురించి ప్రస్తావిస్తున్నారు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడిన ప్రతిసారి, అవకాశం ఇచ్చినప్పుడల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నం చేశారు. 2019లో జరిగిన ఎన్నికలు ఆయనకు గుణపాఠం నేర్పాయి. రాజకీయాలను తట్టుకుని నిలబడాలంటే చాలా సామర్థ్యం ఉండాలి. అంతకు మించి ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. కుట్రలు, కుతంత్రాలు తెలిసి ఉండాలి.
ఒక నాయకుడిగా ఏం చేయాలో ఏం చేయకూడదో తను అర్థం చేసుకుని ఉండక తప్పదు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే చెమటోడ్చాల్సి ఉంటుంది. 138 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా ఆక్సిజన్ కరువై అల్లాడింది. మరోవైపు నాయకత్వ సమస్య తీవ్రంగా ఆ పార్టీని కుదిపేసింది. పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న వాళ్లు ఒక్కరొక్కరే వీడారు. ఈ సమయంలో మరోసారి సోనియా గాంధీనే పార్టీని తన భుజాల మీద వేసుకుంది. ఎక్కువగా మాట్లాడక పోవడం, ఆపద సమయంలో సంయమనం పాటించడం ఆమె తనంతకు తానుగా నేర్చుకున్న అనుభవ పాఠం. ఎందుకంటే తన ముందే అత్తను కోల్పోయింది. తన కళ్లెదుటే భర్తను పోగొట్టుకుంది.ఇంకొకరైతే పిల్లల్ని తీసుకుని ఎక్కడో బతికేందుకు వెళ్లేది. కానీ భారత దేశాన్ని వదిలి వెళ్లలేదు.
తల్లి చేయి పట్టుకుని నడిచిన రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒకానొక దశలో అస్త్ర సన్యాసం చేశారు. కానీ మళ్లీ తన తప్పు తెలుసుకున్నాడు. ఎక్కడి నుంచి వెళ్లాడో అక్కడికే తిరిగి వచ్చాడు. తనను తాను నిరూపించుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ తరుణంలో పార్టీకి పునర్ వైభవం తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సామాజిక వేత్త , ఆలోచనా పరుడిగా పేరు పొందిన యోగేంద్ర యాదవ్ తో జత కట్టాడు. ఎన్నో రాత్రుళ్లు నిద్ర లేకుండా గడిపాడు. అదే భారత్ జోడో యాత్రగా రూపు దిద్దుకుంది. ఆ కార్యక్రమం యావత్ దేశాన్ని కదిలించింది. ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది. రాహుల్ గాంధీ తన కోసం మాట్లాడటం లేదు. ప్రజల గురించి గొంతు విప్పుతున్నారు..ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తనపై అనర్హత వేటు వేసినా జనం పక్షాన ప్రశ్నించడం మానుకోను అంటున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) పప్పు కాదని ఫైర్ అని నిరూపించుకున్నాడు.
Also Read : Telangana Formation