Rahul Gandhi: ప్రధాని మోదీ, ఎలక్షన్ కమీషన్ పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, ఎలక్షన్ కమీషన్ పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi : భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని అన్నారు. బీజేపీ కోసం ఈసీ ‘ఓటు చోరీ’ చేస్తోందని నిరూపించడానికి తమ వద్ద ‘అణు బాంబు’ లాంటి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. దాన్ని పేల్చినప్పుడు ఈసీకి తలదాచుకోవడానికి దేశంలో స్థానం ఉండబోదని ఎద్దేవాచేశారు. ‘‘ఇది రాజద్రోహం కంటే తక్కువేమీ కాదు. మీరు పదవీ విరమణ చేసి ఉండవచ్చు. మరెక్కడైనా ఉండవచ్చు. మేం మిమ్మల్ని కనుగొంటాం’’ అని రాహుల్‌ (Rahul Gandhi) హెచ్చరించారు. బిహార్‌ లో ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసిన రోజే రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

Rahul Gandhi Shocking Comments on EC

గత ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా తక్కువ మెజారిటీతో మూడోసారి ప్రధానిగా గెలుపొందారని అన్నారు. మరో 15 సీట్లు రాకపోయుంటే మోదీ ప్రధాని కాకపోయేవారని పేర్కొన్నారు. బీజేపీకు ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలు పంచుకుందని ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందని… గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పైనా అనుమానాలు ఉన్నాయని వార్షిక లీగల్‌ కాన్‌క్లేవ్‌ 2025లో మాట్లాడుతూ రాహుల్‌ అన్నారు.

అవి బాధ్యతారహిత వ్యాఖ్యలు – ఈసీ

రాహుల్‌ వ్యాఖ్యలను ఈసీ కొట్టిపారేసింది. ఆయన ఆరోపణలు బాధ్యతారహితమైనవని, విచారకరమైనవని పేర్కొంది. ఆధారాలు లేని వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సంస్థలోని అధికారులకు ఈసీ సూచించింది. బాంబులా విస్పోటమవ్వడానికి బదులు నీరులా ప్రవహించండంటూ రాహుల్‌పై భాజపా విమర్శలు గుప్పించింది. ఒకవేళ మీరు బాంబు పేల్చితే మేం రాజ్యాంగాన్ని కాపాడతామని దీటుగా సమాధానమిచ్చింది.

Also Read : Ramdas Soren: బాత్రూంలో జారిపడిపోయిన మంత్రి ! ఆరోగ్య పరిస్థితి విషమం !

Leave A Reply

Your Email Id will not be published!