Raja Singh : చావ‌డ‌కైనా..చంపేందుకైనా సిద్దం

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్

Raja Singh : హైద‌రాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిప్పులు చెరిగారు. ఆయ‌న స్వంత పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. త‌న వ‌ద్ద ఉంటూ ఇంకో పార్టీకి సపోర్ట్ చేసినా లేదా త‌న క‌ళ్ల ముందు ప‌డినా ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. బీజేపీ అభ్య‌ర్థిగా ఆయ‌న మ‌ల‌క్ పేట నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తున్నారు. గురువారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు.

Raja Singh Shocking Comments

స్వంత పార్టీ లోనే ఉంటూ త‌న ఓట‌మికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే స‌మాచారం త‌నకు వ‌చ్చింద‌న్నారు రాజా సింగ్(Raja Singh). వాళ్లు ఎవ‌రో తేలితే తాను ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. ఇందుకు సంబంధించి తాను చావ‌డానికైనా సిద్దంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. లేదంటే చంప‌డానికి అయినా సిద్దంగా ఉన్నాన‌ని డిక్లేర్ చేశారు.

ఇదిలా ఉండ‌గా రాజా సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే నోరు పారేసుకున్నందుకు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు పీడీ యాక్టు కింద కేసు న‌మోదు చేశారు రాజా సింగ్ ను అరెస్ట్ చేశారు.

దీంతో బీజేపీ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేర‌కు రాజా సింగ్ పై వేటు వేసింది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌పై వేటు తొల‌గించింది. చివ‌ర‌కు బీజేపీ అభ్య‌ర్థుల లిస్టులో పేరు ప్ర‌క‌టించింది.

Also Read : P Chidambaram : కాంగ్రెస్ సీఎం రేసులో 12 మంది

Leave A Reply

Your Email Id will not be published!