P Chidambaram : కాంగ్రెస్ సీఎం రేసులో 12 మంది

కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం

P Chidambaram : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం పోస్టుపై రాద్దాంతం కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తామే సీఎం అవుతామంటూ పెద్ద ఎత్తున బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌ధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోద‌ర రాజ న‌ర‌సింహ‌, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ధుయాష్కి గౌడ్, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, వీ హెచ్ హ‌నుమంత రావు సీఎం రేసులో పేర్లు వినిపిస్తున్నాయి.

P Chidambaram Comment Viral

ఈ సంద‌ర్బంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐంఎం పార్టీల చీఫ్ లు కిష‌న్ రెడ్డి, కేసీఆర్ , అస‌దుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఏకంగా సీఎం పోస్టు కోసం 12 మంది ఇప్ప‌టి నుంచే పోటీ ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబ‌రం(P Chidambaram).

ఆయా పార్టీలు చేసిన వ్యాఖ్య‌లను ఖండించారు. తాము లైట్ గా తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. త‌మ పార్టీలో 12 మంది స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌లు ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇంత మంది పోటీ ప‌డుతున్నారంటే కాంగ్రెస్ లో ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని దీనిని నిరూపిస్తుంద‌ని పేర్కొన్నారు చిదంబ‌రం.

ప్ర‌స్తుతం నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీ స‌ర్కార్ కు ప్ర‌జ‌లు షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇక బీజేపీ , ఎంఐఎం ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తున్నారో ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని సూచించారు.

Also Read : Telangana Election Commission : బ‌రిలో 2,290 మంది అభ్య‌ర్థులు

Leave A Reply

Your Email Id will not be published!