Cash Caught : చెన్నూరు – ఎన్నికల వేళ ఊహించని రీతిలో డబ్బులు పెద్ద ఎత్తున పట్టు పడుతున్నాయి. విశాఖ ఇండస్ట్రీస్ , వీఎస్ ఛానల్ చైర్మన్ , ప్రస్తుత చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న గడ్డం వివేక్ వెంకట స్వామికి చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరి నుంచి ఏకంగా రూ. 50 ,00,000 రూపాయలు పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఇదిలా ఉండగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Cash Caught in Telangana
కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే తెలంగాణలో మెగా కృష్ణా రెడ్డితో పాటు వివేక్ వెంకట స్వామి ఫ్యామిలీ ఉంది. ఆయనకు ఉన్న ఛానల్ తెలంగాణ(Telangana) ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఈ ప్రాంతానికి సంబంధించిన యాస, భాషను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వచ్చింది.
వివేక్ వెంకట స్వామి గతంలో ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అక్కడ ఇముడ లేక పోయారు. ఆ వెంటనే కాషాయ జెండా కప్పుకున్నారు. ఆ పార్టీని వీడారు. తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే చెన్నూరు టికెట్ తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఎన్నికల్లో కేవలం డబ్బులు ఉన్న వాళ్లకే ప్రయారిటీ ఉంటుందే తప్పా పని చేస్తున్న వారికి దక్కడం లేదు. మొత్తంగా డబ్బుల వ్యవహారం కలకలం రేపుతోంది చెన్నూరు నియోజకవర్గంలో.
Also Read : Raja Singh : చావడకైనా..చంపేందుకైనా సిద్దం
