Rajinikanth & Kamal Hassan : భారీ వ్యయంతో రజిని , కమల్ మల్టీ స్టారర్ ..!
ఓ భారీ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం
Rajinikanth & Kamal Hassan : నటనలో సరిహద్దులు చెరిపేసిన స్టార్స్ రజనీకాంత్ (Rajinikanth), కమల్‌హాసన్ (Kamal Haasan). దాదాపు అయిదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని తారలుగా వెలుగొందుతున్నారు.
ఇప్పటికీ వీరి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం ఉందని టాక్.
వచ్చే ఏడాది చివరిలో లేదా, 2024 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘విక్రమ్’ (Vikram) తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించక ముందు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రజనీకాంత్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
దానికి లోకేశ్ కనగరాజ్‌ను దర్శకుడిగా అనుకున్నారు. అయితే, పరిస్థితులు మారిపోవడంతో ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. కాలగమనంలో ‘విక్రమ్’ పట్టాలెక్కడం, విడుదలైన రికార్డులు తిరగరాయడం జరిగిపోయింది.
అప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టును మళ్లీ మొదలు పెట్టాలని కమల్ భావించారట. ఈ చిత్రంలో రజనీకాంత్‌ను కూడా భాగస్వామిగా చేర్చుకుంటున్నారని సమాచారం. అంతేకాదు, రజనీ-కమల్ ఇద్దరూ తెరపై కనిపిస్తారని అంటున్నారు.
ఇదే జరిగితే కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.250 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇటు కమల్‌హాసన్, అటు రజనీకాంత్ ఇద్దరూ పారితోషికం లేకుండానే పనిచేయనున్నారని తెలుస్తోంది.
అదే జరిగితే ‘విక్రమ్’ను మించి అంచనాలు ఈ సినిమాకు ఉంటాయి అని కోలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
Also Read : బీచ్ లో ప్రియాంక నిక్ ముద్దు మురిపెం