కొలిక్కి వ‌చ్చిన రామ‌లింగా రెడ్డి వ్య‌వ‌హారం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌కలో చోటు చేసుకున్న రాజ‌కీయ సంక్షోభానికి ఎట్ట‌కేల‌కు తెర‌దించే ప్ర‌య‌త్నం చేశారు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మంత్రిగా ఉన్న సీనియ‌ర్ నేత రామ‌లింగారెడ్డి ఉన్న‌ట్టుండి రాజీనామా చేశారు. త‌న‌కు బెంగ‌ళూరు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రిగా ఛాన్స్ ఇవ్వాల‌ని లేక పోతే తాను ఒప్పుకోనంటూ ఉన్న‌ట్టుండి ప్ర‌మాణ స్వీకారం అయిన వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రామ‌లింగా రెడ్డి. దీంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది కాంగ్రెస్ లో. దీనిపై తీవ్రంగా స్పందించారు డీకే శివ‌కుమార్. ఇది చిన్న స‌మ‌స్య అని, త‌న‌కు ఉన్న స‌న్నిహిత నాయ‌కుల‌లో రామ‌లింగా రెడ్డి కూడా ఒక‌రని పేర్కొన్నారు.

శ‌నివారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఇది కుటుంబ పరమైన విషయం అన్నారు. మేమంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం. అంతా పరిష్కారమైందని పేర్కొన్నారు. దీనిపై ఎక్కువ‌గా ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల ఒరిగేది ఉండ‌ద‌న్నారు. ఇది కేవలం సమాచార లోపం వ‌ల్ల జ‌రిగిన విష‌య‌మేన‌ని పేర్కొన్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే స‌త్తా త‌మ‌కు ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. సీనియర్ నాయకులందరికీ అవకాశాలు కల్పించాం, అన్నింటినీ సరిదిద్దుతామ‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజీనామాను ఉపసంహరించుకునేలా ఆ సీనియర్ నాయకుడిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రాత్రి జయనగర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో శివకుమార్ దాదాపు రెండున్నర గంటల పాటు రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశం శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.

Leave A Reply

Your Email Id will not be published!