#JournalistMovie : ఫిబ్రవరి 5 న విడుదల కానున్న రామ్‌కి జర్నలిస్ట్

Ramki's 'Journalist' to release on February 5

‘గంగపుత్రులు’ ఫేమ్ రామ్‌కి హీరోగా వార్త కె. మహేష్ దర్శకత్వంలో రూపొందింన చిత్రం ‘జర్నలిస్ట్ . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5 న థియేటర్లలో విడుదల చేయ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో హీరో రామ్‌కి మాట్లాడుతూ, సామాజిక స్పృహ ఉన్న జర్నలిస్టులంటే నాకు చాలా ఇష్టం. తమ జీవితాలను ప‌ణంగా పెట్టి సత్యాన్ని వెలుగులోకి తెసుకువ‌చ్చి జ‌ర్న‌లిస్టుల స్ఫూర్తితో ఈ సినిమా చేసేందుకు అంగీక‌రించాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది అని అన్నారు. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు శంకర్ గారు చేసినందుకు నేను ఆనందంగా ఉంద‌న్నారు.

నటుడు సుబ్బారావు మాట్లాడుతూ ఈ చిత్ర ప్రెజెంటర్ రాజ్ కుమార్, “జర్నలిస్టులకు సమాజంలో ఉన్నత స్థానం ఉంది” అని చెపుతారు అది నిజ‌మే. అయితే మీడియా అధిపతులు, రాజకీయ నాయకులు జర్నలిస్టులను త‌మ‌ స్వార్ధానికి ఎలా వాడుకుంటార‌న్న‌ది ఈ సినిమాలో చూపించామ‌న్నారు.

ఈ చిత్రంలో తాషూ కౌశిక్ హీరోయిన్ గా నటించగా దర్శకుడు ఎన్ శంకర్, సీనియర్ నటుడు సురేష్ ముఖ్య పాత్రలు పోషించారు. చలపతి రావు, సురేష్ మైసూర్, గిరి తదితరులు తారాగణం.

ఈ సినిమాకి రఘు కుంచె , డాక్టర్ జోష్యా భట్ల. సంగీతం అందించ‌గా సినిమాటోగ్రఫీ ముజీర్ మాలిక్ ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావులు నిర్వ‌హించారు.

No comment allowed please