#NelloreChepalaPulusu : నెల్లూరు చేపల పులుసు ఎప్పుడైనా టేస్ట్ చేసారా ?

నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్.

NelloreChepalaPulusu : చేపల పులుసు అంటే ఇష్టం లేని వారు ఉండరు. అందులోను నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. దానికి కావలసిన పదార్ధాలు, తయారు చేయు విధానము ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

చేప ముక్కలు – 1 కేజీ
చింతపండు – కొద్దిగా
ఉప్పు – తగినంత
ఆవాలు – 1 స్పూను
మెంతులు – 1 స్పూను
ఉల్లిపాయలు – 2
మిరప పొడి – 2 టేబుల్ స్పూన్స్
పసుపు పొడి – 1/2 టేబుల్ స్పూన్
దనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
నువ్వుల నూనె – 5 టేబుల్ స్పూన్స్
కరివేపాకు – 2 రెబ్బలు
టమెటాలు – 2
పచ్చి మిరపకాయలు – 3
మామిడి కాయ – 1
మిరియాలు – 1 స్పూన్
వెల్లుల్లి – 6 రెబ్బలు

తయారుచేయు విధానం :

ముందుగా చేప ముక్కలు శుభ్రం చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత చింత పండును తగినంత నీటిలో నాన బెట్టుకొని రసము తీయాలి. దానికి మిరప పొడి, పసుపు పొడి, ఉప్పు, కలిపి చిక్కటి పులుసును సిద్ధం చేసుకొవాలి. తర్వాత స్టౌ మీద పాన్ పుట్టుకుని మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించి చల్లారిన తర్వాత మెత్తని పొడిగా చేసి పెట్టుకోవాలి.

తర్వాత అదే పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, పొడుగ్గా తరిగిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమోటాలు, వేసి బాగా వేగనిచ్చి ఆందులో ముందుగా కలిపి పెట్టుకొన్న పులుసు పొసి, మామిడి ముక్కలు వేసి బాగా తెర్ల నివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న పులుసులో మసాలపొడిని వేసి కలపాలి. ఆ తరువాత చేపముక్కలను వేసి ముక్కలు వుడికిన తరువాత వెల్లుల్లి వేసి కాసేపు వుంచి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయినట్లే. దీనిని చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది.

 

No comment allowed please