#RaniRudrama : జనవరి 18 నుంచి స్టార్‌ మా లో రాణి రుద్రమ

Rani Rudrama : ఇది మన తెలుగు కథ. మన తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కథ. ఇంతకుముందు ఎన్నడూ బుల్లితెరపై కనిపించని ప్రమాణాలతో స్టార్‌ మా అందిస్తున్న కథ “రుద్రమదేవి”

Rani Rudrama : ఇది మన తెలుగు కథ. మన తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కథ. ఇంతకుముందు ఎన్నడూ బుల్లితెరపై కనిపించని ప్రమాణాలతో స్టార్‌ మా అందిస్తున్న కథ “రుద్రమదేవి”

తెలుగు టెలివిజన్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా ’ ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిల్ ‘స్టార్‌ మా. కొత్తరకం కథల్ని, ధైర్యసాహసాల వ్యక్తుల విశిష్ట గాధల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఎప్పుడూ కొత్తదనానికి అగ్ర తాంబూలం ఇస్తూ వస్తున్న విష‌యం విదిత‌మే.

ఏ పేరు వింటే ప్రతి తెలుగు హృదయం ఉప్పొంగుతుందో.. ఆ కథే ఇప్పుడు ఓ అద్భుతమైన ధారావాహికగా తెలుగు లోగిళ్లకు గొప్ప అనుభూతిని పంచబోతోంది “రుద్రమదేవి” సీరియల్‌..

స్ట్రెయిట్‌ తెలుగు సీరియల్‌గా, ఓ దృశ్యకావ్యంలా రూపు దిద్దుకున్న ఈ రుద్రమదేవి ధారావాహిక కథాకాలాన్ని యథాతథంగా చిత్రీకరించేందుకు వందల మంది ఎంతగానో కషి చేస్తున్నారు. సినిమాల‌కు ధీటుగా ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు దీక్షగా పనిచేస్తున్నారు. ఈ ధారావాహిక ‘స్టార్‌ మా’ లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుందని స్టార్ మా పిఆర్ ఓ మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు.

No comment allowed please