#KvKrishnaReddy : మామూలోడు కాదు మన కేవీ కృష్ణారెడ్డి

బెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్

Kv Krishna Reddy : మామూలోడు కాదు మన కేవీ కృష్ణారెడ్డి. ఆంట్రపెన్యూయిర్, ట్రావెలర్ , ఫోటోగ్రాఫర్, ఐఐటీయన్, బెస్ట్ సక్సెస్ ఫుల్ సీఇఓ కూడా. ఇడియా ల్యాబ్ పేరుతో ఐటీ కంపెనీని హైదరాబాద్ లో ఏర్పాటు చేశాడు. వెబ్ సొల్యూషన్స్, టెక్నాలాజీ పరంగా కన్సల్టెన్సీ కూడా సేవలు అందిస్తోంది ఈ కంపెనీ. స్వతహాగా ఐఐటీ పూర్తి చేయడంతో మనోడి మెదడు పాదరసం లా పని చేసింది. తాను జాబ్ చేస్తే తనకు, ఫ్యామిలీకి మాత్రమే సంతోషం. తానే ఓ కంపెనీ పెడితే వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది.

ఎన్నో కుటుంబాలకు ఆధారం ఇచ్చినట్లవుతుందని ఆలోచించాడు. కేవీ కృష్ణారెడ్డిది(Kv Krishna Reddy) అనపర్తి ప్రాంతం. ఐఐటీ బాంబే లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో పూర్తి చేశాడు. ఎస్టీవివి ఐటీ కంపెనీకి కన్సల్టెంట్ గా ఉన్నాడు. ప్రపంచంలోనే ఎంతో పేరు గాంచిన సెర్చింగ్ దిగ్గజ కంపెనీ రీడిఫ్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని చేశాడు.

స్క్సివ్ ఇంటర్నెట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా చీఫ్ టెక్నీకల్ ఆఫీసర్ గా కృష్ణారెడ్డి పని చేశారు. ఇడియా వెబ్ సొల్యూషన్స్ కు సిఇఓ గా ఉన్నారు. ఇదే కంపెనీ పేరుతో ఫౌండేషన్ స్థాపించాడు. తాజాగా చెన్నైలో భారీ ఎత్తున వర్క్ జోన్ బిజినెస్ సెంటర్ పేరుతో కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆంట్రప్రెన్యూర్ గా, స్టార్ట్ అప్ గా, టెక్నీకల్ ఎక్స్ పర్ట్ గా, ఇన్నోవేటివ్ థింకర్ గా రెడ్డి పేరు తెచ్చుకున్నారు. సాఫ్ట్ వెర్ ఆర్కిటెక్ట్ గా ఎంతో గుర్తింపు పొందారు.

ఆయన పనితీరును మాజీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మెచ్చుకున్నారు. ఐటీ రంగంలో కేవీ కృష్ణారెడ్డికి 15 ఏళ్ళ అనుభవం ఉన్నది. మొబైల్ టెక్నాలజీస్, ఆన్ లైన్ మీడియా, సాఫ్ట్ వెర్ ఆర్కిటెక్చర్ డిజైన్ , సాఫ్ట్ వెర్ సిస్టమ్స్ ఆటోమేషన్ లో ఆరితేరారు. ప్రకృతి అన్నా, ఆధ్యాత్మికత అన్నా ఇష్టం.

రెడ్డి(Kv Krishna Reddy) ప్రయాణం ముంబై, బెంగళూర్ లలో సాగింది. ఎంత ఎత్తుకు ఎదిగినా సామాజిక భాద్యతను మరిచి పోకూడదు అంటారు కృష్ణా రెడ్డి. అందుకే ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో కొంత సమాజానికి ఇస్తున్నారు. ఎక్కువగా ప్రయాణం చేయడం అన్నా, చెస్ ఆడడం అన్నా, పజిల్స్ ను సాల్వ్ చేయడమంటే రెడ్డికి ఇష్టం. ఫోటోగ్రఫీ, రైటింగ్ హాబీగా పెట్టుకున్నారు. కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేసే వాళ్లకు డబ్బులున్నా, వనరులున్నా స్పెస్ ఉండదు. అందుకే అలాంటి వారి కోసం ప్రత్యేకంగా వర్క్ జోన్ బిజినెస్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు.

చెన్నైలో స్థలం దొరకాలంటే చాలా కష్టమైన పని. కానీ రెడ్డి దానిని అధిగమించాడు. ఏకంగా ఐటీ కంపెనీకి శ్రీకారం చుట్టాడు. బ్లాగర్ గా కూడా రెడ్డి పేరు పొందారు. తనలోని భావాలను అందులో ఎప్పటికప్పుడు రాస్తుంటడు. తన ఆలోచనలు వర్క్ అవుట్ అయ్యేలా చేయడంలో నిమగ్నమయ్యాడు. కేవీ కృషారెడ్డి రాబోయే రోజుల్లో బెస్ట్ సీఈఓ గా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఐద్యా వెబ్ సొల్యూష‌న్స్ కంపెనీని ఏర్పాటు చేశాడు.

No comment allowed please