#RitabhariChakraborty : నటి వెడ్డింగ్ లుక్ ఫోటోను వైరల్ చేసిన నెటిజన్లు..
Actress
Ritabhari Chakraborty : ప్రముఖ నటి రితాభరి చక్రవర్తి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు కారణం ఏమిటంటే రితా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో. ఆ ఫోటోలో ఎరుపు రంగు చీర కట్టుకుని బంగారు ఆభరణాలతో రీతా మెరిసిపోయింది.
అచ్చం పెళ్లి కూతరులా ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆ ఫోటోను విపరీతంగా షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే రితా పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఫొటో బ్రహ్మకు రహస్యం తెలుసు సినిమా సమయంలో తీసిన ఫొటోషూట్‌కు సంబంధించిన చిత్రంగా తేలింది.
రితా ఈ ఫొటోను మాత్రమే కాకుండా మరికొన్ని పాత ఫొటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఈ వెడ్డింగ్ లుక్‌లో ఉన్న ఫొటో మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
No comment allowed please