RR vs CSK IPL 2023 : రాజస్థాన్ సెన్సేషన్ చెన్నై పరేషాన్
పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్
RR vs CSK IPL 2023 : పొట్టి ఫార్మాట్ లో ఉన్న మజా ఏమిటో మరోసారి అనుభవం లోకి వచ్చింది. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్(RR vs CSK IPL 2023) అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
బంతి బంతికి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది. చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. మ్యాచ్ మొత్తం ఉత్కంఠతకు దారి తీసింది. ఇరు జట్లు స్పూర్తి దాయకమైన ఆట తీరును ప్రదర్శించాయి.
మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్ కు మరిచి పోలేని జ్ఞాపకాలను మిగిల్చింది ఈ మ్యాచ్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. నిర్ణీత 20 ఓవర్లలో 175 రన్స్ చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాలో ఓటమి పాలైంది.
సీఎస్కే స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా చివరి దాకా పోరాడినా ఫలితం లేక పోయింది. ఇద్దరూ సిక్సర్లతో రెచ్చి పోయారు. ఆఖరి ఓవర్ వేసిన సందీప్ శర్మ మ్యాచ్ విన్నర్ గా మారి పోయాడు. దీంతో లీగ్ లో రాజస్థాన్ రాయల్స్(RR vs CSK) కు ఇది మూడో విజయం.
జైశ్వాల్ 10 రన్స్ చేస్తే పడిక్కల్ , జోస్ బట్లర్ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. మరోసారి సంజూ శాంసన్ విఫలమయ్యాడు. జిడ్డూ బౌలింగ్ లో చిక్కాడు. పడిక్కల్ 38 రన్స్ చేశాడు. అశ్విన్ 30 పరుగులు , బట్లర్ 52 రన్స్ చేశారు. ఆకాశ్ సింగ్ , దేశ్ పాండే , జడేజా చెరో 2 వికెట్లు తీశాడు. మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read : వరల్డ్ కప్ లో పాక్ ఆడే ఛాన్స్