RR vs LSG IPL 2023 : రాజ‌స్థాన్ ల‌క్నో బిగ్ ఫైట్

జోరు మీదున్న రాయ‌ల్స్

RR vs LSG IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో కీల‌క‌మైన పోరుకు సిద్ద‌మైంది 26వ లీగ్ మ్యాచ్ . ఇప్ప‌టికే ఈ సీజ‌న్ లో 5 మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో గెలుపొంది ఒక మ్యాచ్ తో ఓట‌మి పాలైన రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR vs LSG IPL 2023) పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ 1లో ఉంది. ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 3 గెలిచి 2 మ్యాచ్ లలో ఓడి పోయింది. ఇక అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బ‌లంగా ఉంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్.

ఆ జ‌ట్టులో య‌శ‌స్వి జైశ్వాల్ , జోస్ బ‌ట్ల‌ర్, సంజూ శాంస‌న్ , ప‌డిక్క‌ల్ , షిమ్రోన్ హిట్మెయ‌ర్ , ధ్రువ్ జురైల్ కీల‌కంగా ఉన్నారు. ఇక బౌలింగ్ ప‌రంగా కూడా ప్ర‌భావం చూప‌నున్నారు. చివ‌ర‌లో మెరుపులు మెరిపించేందుకు అశ్విన్ , జాస‌న్ హోల్డ‌ర్ ఉండ‌నే ఉన్నారు.

ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇప్ప‌టి దాకా 6 వికెట్లు తీస్తే యుజ్వేంద్ర చాహ‌ల్ 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక జ‌ట్టులో అత్య‌ధిక ప‌రుగులు చేశాడు జోస్ బ‌ట్ల‌ర్. సందీప్ శ‌ర్మ కూడా కీల‌క‌మైన బౌల‌ర్ గా మారాడు. ట్రెంట్ బౌల్ట్ , జాస‌న్ లు స‌త్తా చాటేందుకు రెడీగా ఉన్నారు.

ల‌క్నో ప‌రంగా కేఎల్ రాహుల్ , కైల్ మేయ‌ర్స్ , నికోల‌స్ పూర‌న్ , మార్క‌స్ స్టోయినిస్ , దీపక్ హూడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బ‌డోనీ , మార్క్ వుడ్ రాణిస్తే ఢోకా ఉండ‌దు. మొత్తంగా ఇవాళ జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

Also Read : తిల‌క్ వ‌ర్మ ఇంట్లో ‘ముంబై’ సంద‌డి

Leave A Reply

Your Email Id will not be published!