RR vs LSG IPL 2023 : గెలవాల్సిన మ్యాచ్ లో బోల్తా పడ్డారు
లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ
RR vs LSG IPL 2023 : ఓటమిని కోరి కొని తెచ్చుకునే వాళ్లను ఏమంటాం. అదే జరిగింది రాజస్థాన్ రాయల్స్ జట్టు విషయంలో . తమ స్వంత గ్రౌండ్ లో ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. టాస్ గెలిచిన సంజూ శాంసన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ప్రధానంగా టెంట్ బౌల్ట్ మెస్మరైజ్ చేశాడు తన బౌలింగ్ తో.
లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 154 రన్స్ చేసింది. ఇదేమంత బిగ్ స్కార్ కాదు ఐపీఎల్ పరంగా చూస్తే. కేఎల్ రాహుల్ , కైల్ మేయర్స్ , నికోలస్ పూరన్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. అనంతరం 155 పరుగుల స్వల్ప లక్ష్యంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్(RR vs LSG IPL 2023) ఆరంభంలోనే అదుర్స్ అనిపించేలా ఆడింది. యశస్వి జైశ్వాల్ , జోస్ బట్లర్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎప్పుడైతే స్టోయినిస్ బౌలింగ్ కు వచ్చాడో జైశ్వాల్ ఔట్ అయ్యాడు.
రెండో ఓవర్ లో ఫుల్ జోష్ మీదున్న జోస్ బట్లర్ ను పెవిలియన్ కు పంపాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన సంజూ శాంసన్ అనవసరంగా రనౌట్ అయ్యాడు. ఇది ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. ఆ తర్వాత వచ్చిన షిమ్రోన్ అవేష్ ఖాన్ బంతికి బోల్తా పడ్డాడు. రియాన్ పరాగ్, పడిక్కల్ చివరలో మెరిసినా పుణ్య కాలం గడిచి పోయింది. రాజస్థాన్ పై లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
Also Read : బెంగళూరు పంజాబ్ నువ్వా నేనా