Rupee All Time Low : కనిష్ట స్థాయికి పడి పోయిన రూపాయి
ప్రపంచ మార్కెట్ లో డాలర్ ప్రభావం
Rupee All Time Low : భారతీయ రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్ తో పోలిస్తే ప్రధాన కరెన్సీల ప్రభావం కారణంగా భారత రూపాయి విలువ కనిష్టానికి చేరుకుంది(Rupee All Time Low) .సోమవారం డాలర్ కు రూ. 81.50కి పడి పోయింది రూపాయి. ఇప్పటికే భారత దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారా స్థాయికి చేరింది.
రూపాయి విలువ క్షీణించడం వరుసగా ఈ ఏడాది మూడోసారి కావడం విశేషం. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే మరింత దిగజారింది. ఇది తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుంది. బ్లూమ్ బెర్గ్ ప్రకారం 80.99 తో పోలిస్తే బలహీన స్థాయి 81.52 వద్ద ప్రారంభమై రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయి 81.55 కి తాకింది.
రూపాయి చివరిసారిగా డాలర్ కు రూ. 81.50 వద్ద మారిందని పేర్కొంది. ఇక ప్రారంభ ట్రేడింగ్ లో యుఎస్ డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ 38 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 8147 వద్దకు చేరుకుంది. వడ్డీ రేట్ల పెంపు , ద్రవ్యోల్బణ చక్రానికి వ్యతిరేకంగా బలమైన కొనుగోళ్లకు సాక్ష్యమిచ్చే డాలర్ ఇండెక్స్ ద్వారా భయాందోళనలు కలిగించాయి.
రూపాయి క్షీణత కొనసాగుతూనే ఉండడం ఒకింత ఆందోళన కలిగిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి పతనం మరింత ఇబ్బందికరంగా మారనుంది. ఆర్బీఐ పాలసీకి ముందు రూపాయి శ్రేణి 80.50 మధ్య చూడవచ్చని తెలిపారు.
ఇదిలా ఉండగా వారం రోజుల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రేట్లను పెంచేందుకు కాచుకుని కూర్చుంది. ఇలాగే రూపాయి పతనం చెందుతూ పోతే ఆర్థిక రంగం దివాళ అంచుకు చేరే ప్రమాదం పొంచి ఉంది.
Also Read : భారత్ లో ఐ ఫోన్ 14 తయారీకి రెడీ