Roman Starovoit: రష్యా మంత్రి ఆత్మహత్య ! పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే ఘటన !
రష్యా మంత్రి ఆత్మహత్య ! పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే ఘటన !
Roman Starovoit : పదవి నుంచి తొలగించిన కొద్ది గంటల వ్యవధిలోనే రష్యా రవాణా శాఖ మంత్రి రోమన్ స్టారోవోయిత్ సోమవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మాస్కో శివారులో తన సొంత కారులోనే ఆయన ప్రాణాలు తీసుకున్నారు. కొంతకాలంగా ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్న అధ్యక్షుడు పుతిన్ ఆయనను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. పదవి నుంచి తొలగిస్తూ పుతిన్ ఇచ్చిన ఆదేశాలను రష్యా లీగల్ ఇన్‌ఫర్మేషన్ పోర్టల్‌లో పెట్టినా ఇందుకుగల కారణాలను వివరించలేదు. ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉన్న కుర్ష్క్ రీజియన్‌కు అయిదేళ్లపాటు గవర్నర్‌గా పనిచేసిన స్టారోవోయిత్‌ను (Roman Starovoit) గత ఏడాది మే నెలలో రవాణా శాఖ మంత్రిగా పుతిన్ నియమించారు.
Roman Starovoit – సౌదీలో గతేడాది 345 మందికి ఉరి
సౌదీ అరేబియాలో గత ఏడాది విధించిన మరణశిక్షల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సోమవారం పేర్కొంది. 2024లో సౌదీలో ఏకంగా 345 మందిని ఉరితీయగా… తమ రికార్డుల ప్రకారం ఈ సంఖ్య గత మూడు దశాబ్దాలకు పైగా కాలంలోనే అత్యధికమని వెల్లడించింది. మాదకద్రవ్యాల కేసుల్లో శిక్షలు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ సంవత్సరం కూడా మొదటి ఆరు నెలల కాలంలోనే 180 మందికి మరణశిక్ష విధించారని, గత రికార్డును ఈ ఏడాది అధిగమించే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై మానవ హక్కుల కార్యకర్తలతో పాటు ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : Maharashtra Coast: ‘మహా’తీరంలో విదేశీ నౌక హల్ చల్
