Sachin Tendulkar : క్రికెట్ ఫార్మాట్ లో మార్పులు అవసరం
మాజీ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్
Sachin Tendulkar ODI Format : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సచిన్ రమేష్ టెండూల్కర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన వన్డే మ్యాచ్ ల ఫార్మాట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా విసుగు తెచ్చేలా చేస్తోందని పేర్కొన్నారు. వన్డే క్రికెట్ మ్యాచ్ లో నియమాలను మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. టెస్టు క్రికెట్ ప్రాధాన్యత ఉండేలా, ఆకర్షణ చెక్కు చెదరకుండా ఉండేలా చూడాలని సూచించారు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar).
ఇటీవల టెస్టు సీరీస్ కూడా నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. టెస్టు సీరీస్ తో పాటు వన్డే సీరీస్ కూడా ఇలాగే తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ క్రికెటర్ . ట్రాక్ , స్లో ట్రాక్ , టర్నింగ్ ట్రాక్ , స్వింగంగ్ , విభిన్న బంతులతో సీమింగ్ పరిస్థితులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు . ఐసీసీ, ఎంసీసీ , ఇతర క్రికెట్ సంస్థలు టెస్టు క్రికెట్ ను వినోద భరితంగా , నెంబర్ 1 ఫార్మాట్ గా మార్చాలని పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
మూడు రోజుల్లో మ్యాచ్ లు ముగియడం వల్ల నష్టం ఏమీ జరగలేదన్నాడు. పర్యటనలో ఉన్నప్పుడు సులభమైన పరిస్థితులు అంటూ ఏవీ ఉండవు. ఆడే జట్లుకు ఒకేసారి అవకాశాలు ఉంటాయని గుర్తుంచు కోవాలని స్పష్టం చేశారు సచిన్ రమేష్ టెండూల్కర్(Sachin Tendulkar ODI Format). బౌలింగ్ పరంగా కూడా మార్పులు చేయాలని సూచించారు.
ఉపరితలం డిమాండ్ చేస్తే కొత్త బంతిని స్పిన్నర్‌కు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదని అతను చెప్పాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే మాజీ క్రికెటర్ , మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వన్డే క్రికెట్ ఫార్మాట్ ను మార్చాలని కోరాడు. 40 ఓవర్లకు కుదించాలని సూచించాడు. ఈ తరుణంలో సచిన్ షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : రాణించిన రాహుల్ గెలిచిన భారత్