Rohit Sharma : సేమ్ సీన్ రోహిత్ శ‌ర్మ ప‌రేషాన్

మ‌రోసారి నిరాశ ప‌రిచిన కెప్టెన్

Rohit Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. ఈసారి ఐపీఎల్ 16వ సీజ‌న్ లో పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఇప్ప‌టి దాకా ఆడిన మ్యాచ్ ల‌లో కేవ‌లం 200 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు రోహిత్ శ‌ర్మ‌. 12 లీగ్ మ్యాచ్ ల‌లో ఆడాడు హిట్ మ్యాన్. కెప్టెన్ గా ముంబై ఇండియ‌న్స్ ను విజ‌య ప‌థంలో న‌డిపిస్తున్నా వ్య‌క్తిగ‌తంగా ఆశించిన మేర రాణించ‌డం లేదు. ఇది ముంబై జ‌ట్టు యాజ‌మాన్యాన్ని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

తాజాగా ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) తో జ‌రిగిన మ్యాచ్ లో కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. వ‌నితు హ‌స‌రంగా బౌలింగ్ లో అద్బుత‌మైన బంతికి ఔట్ అయ్యాడు. ఆ ర‌న్స్ చేసేందుకు కూడా నానా తంటాలు పడ్డాడు హిట్ మ్యాన్. దీంతో మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

రోహిత్ శ‌ర్మ హిట్ మ్యాన్ కాద‌ని నో హిట్ శ‌ర్మ అంటూ ఎద్దేవా చేశాడు. ఆయ‌న అన్న‌ట్టుగానే రోహిత్ పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచాడు మ‌రోసారి. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్యంత చెత్త రికార్డు న‌మోదు చేశాడు ముంబై కెప్టెన్. ఇప్ప‌టి దాకా 16 సార్లు గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక హ‌స‌రంగా వేసిన ఐదో ఓవ‌ర్ లో రోహిత్ ఔట్ అయ్యాడు.

Also Read : చెన్నై కింగ్స్ జోరు ఢిల్లీ హుషారు

Leave A Reply

Your Email Id will not be published!