Sarah Todd PM Modi : మోదీని క‌ల‌వ‌డం అదృష్టం – సారా

మోస్ట్ పాపుల‌ర్ ఆస్ట్రేలియ‌న్ చెఫ్

Sarah Todd PM Modi : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) మోస్ట్ పాపుల‌ర్ అయి పోయారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆహ్వానం మేర‌కు అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పీఎంను క‌లిసేందుకు పోటీ ప‌డ్డారు. తాజాగా ప్ర‌పంచంలో మోస్ట్ ఫేమ‌స్ చెఫ్ గా పేరు పొందారు ఆస్ట్రేలియాకు చెందిన చెఫ్ సారా టాడ్(Sarah Todd). మంగ‌ళ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తు ప‌ట్ల అత్యంత ఆశాభావం క‌లిగిన గొప్ప నాయ‌కుడితో స‌మావేశం అయ్యాను. చాలా థ్రిల్లింగ్ కు గుర‌య్యాన‌ని చెఫ్ సారా టాడ్ పేర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే తన‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా, అంత‌కు మించిన అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపింది.

చాలా విష‌యాలు మోదీతో పంచుకున్న‌ట్లు పేర్కొంది సారా టాడ్. ఇదిలా ఉండ‌గా ఆమె మోదీని ఇన్ క్రెడిబుల్ మ్యాన్ అంటూ కితాబు ఇచ్చింది. కాగా సారా టాడ్ ను ఆహ్వానించారు ప్ర‌ధాని. ఆమె పురాత‌న భార‌తీయ వంట‌కాలు, ఆయుర్వేదం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ప్ర‌భావ‌శీల‌మైన వ్య‌క్తిగా నేను ఆయ‌న‌ను గుర్తిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసింది సారా టాడ్. భార‌త దేశం ప‌ట్ల నాకున్న ప్రేమ‌ను, ఆహార ప‌రిశ్ర‌మ ప‌ట్ల నాకున్న అభిరుచిని బ‌ల‌ప‌రిచింది. నేను స‌రైన మార్గంలో ఉన్నాన‌ని తెలిపింద‌ని పేర్కొంది.

Also Read : UT Khader Speaker

 

Leave A Reply

Your Email Id will not be published!