UT Khader Speaker : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా ఖాదర్
నామినేషన్ దాఖలు చేసిన యుటీ
UT Khader Speaker : కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పదవి రేసులో సీనియర్ నాయకుడు యుటి ఖాదర్(UT Khader) కు అసెంబ్లీలో అత్యున్నతమైన సభాపతి (స్పీకర్ ) గా ఎంపిక చేసింది. మంగళవారం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు కొత్తగా కొలువు తీరిన మంత్రులతో కలిసి అసెంబ్లీలో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
మొత్తం 224 సీట్లకు గాను 136 సీట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇక యుటీ ఖాదర్ ఎన్నిక లాంఛనప్రాయమని చెప్పక తప్పదు. విధాన సభ ఎన్నికల్లో యుటీ ఖాదర్ వరుసగా ఐదోసారి గెలుపు సాధించారు . ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతు తెలిపే నామినేషన్ పత్రాలపై సంతకం చేసే లాంఛనాలను పూర్తి చేశారు ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం.
ఇదిలా ఉండగా అసెంబ్లీ తదుపరి స్పీకర్ గా ఆర్ వి దేశ్ పాండే, టివి జయ చంద్ర, హెచ్ కే పాటిల్ ల పేర్లను ప్రకటిస్తారని పుకార్లు వచ్చాయి. ఈ తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ రణ దీప్ సూర్జే వాలా, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ యుటీ ఖాదర్ తో సమావేశమయ్యారు.
యూటీ ఖాదర్ గత అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఈ ఏడాది దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. రెండేళ్ల తర్వాత జరగనున్న మంత్రివర్గ విస్తరణలో గ్యారెంటీగా మంత్రి పదవి ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : Avinash Reddy
