Shah Rukh Khan : ఆల్ టైమ్ నటుల్లో బాద్ షా
టాప్ 50 మంది నటుల్లో ఒకడు
Shah Rukh Khan : పఠాన్ మూవీతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు బాద్ షాగా పిలుచుకునే షారుఖ్ ఖాన్ కు అరుదైన గౌరవం లభించింది. ఒక రకంగా విమర్శల జడి వాన నుంచి సేద దీరేలా చేసింది ఈ వార్త. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతమైన నటుల జాబితాను ఎంపైర్ మ్యాగజైన్ ఎంపిక చేసింది.
ఆ వరల్డ్ వైడ్ ఎంపిక చేసిన 50 మంది అద్భుత నటుల్లో షారుక్ ఖాన్ కు(Shah Rukh Khan) చోటు దక్కడం విశేషం. గ్రేట్ బ్రిటన్ కు చెందిన ఎంపైర్ మ్యాగ్ జైన్ ప్రతి ఏటా ఆల్ టైట్ నటుల లిస్టు ను ప్రకటిస్తుంది. ఈ మొత్తం నటీనటుల్లో హాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.
వారిలో వాషింగ్టన్ డెంజిల్ , టామ్ హాంక్స్ , ఆంథోనీ మార్లన్ బ్రాండ్ లాంటి దిగ్గజ నటులతో పాటు భారత దేశానికి చెందిన ఏకైక నటుడిగా షారుక్ ఖాన్ నిలిచాడు. ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్ టైమ్ పేరుతో విడుదల చేసింది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఎందుకు అతడిని ఎంపిక చేయాల్సి వచ్చిందనే దానిని గుర్తు చేసింది. ఆయన నటన, ప్రతిభ, అభిమానుల గురించి కూడా తెలిపింది. అంతే కాకుండా షారుక్ ఖాన్ నటించిన సినిమాలో బెస్ట్ డైలాగ్ గురించి కోట్ చేసింది ఎంపైర్ మ్యాగజైన్. బతుకు రోజు మన శ్వాసను కొద్ది కొద్దిగా హరిస్తుంది.
అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది అన్న పాపులర్ డైలాగ్ ను కోట్ చేసింది. అందుకే షారుక్ ఖాన్ ను అత్యుత్తమ ప్రతిభా పాటవాలు కలిగిన నటుల్లో ఒకడిగా చేర్చడం జరిగిందని స్పష్టం చేసింది .
Also Read : బయటకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి