TOP 50 Defaulters : బ్యాంకుల‌కు రూ. 92,570 కోట్లు టోక‌రా

ఎగ‌వేత‌దారుల్లో మెహుల్ చోక్సీ టాప్

TOP 50 Defaulters : భార‌త దేశానికి చెందిన బ్యాంకుల్లో కోట్లు కొల్ల‌గొట్టి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. పార్ల‌మెంట్ సాక్షిగా టాప్ 50 మంది కొల్ల‌గొట్టిన వారి జాబితా(TOP 50 Defaulters) వెల్ల‌డించారు. ఆర్థిక నేర‌గాళ్లు ఏకంగా ఒక‌టి కాదు రూ. 92,570 కోట్లు బ‌కాయి ప‌డ్డారు. మెహుల్ చోక్సీ అగ్ర స్థానంలో ఉన్నారు.

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల స్థూల నిర‌ర్థ‌క ఆస్తులు (ఎన్బీఏలు) రూ. 8.9 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి. మార్చి 31, 2022 నాటికి భార‌తీయ బ్యాంకుల‌కు స‌మిష్టిగా భారీ ఎత్తున కోట్లు బ‌కాయి ప‌డ్డారు. కోట్లు కొల్ల‌గొట్టి భార‌త్ ను దాటేసి విదేశాల్లో చిక్క‌కుండా ఉన్నాడు మెహుల్ చోక్సీ. ఉద్దేశ పూర్వ‌కంగానే మోసానికి పాల్ప‌డ్డారు.

ప‌రారీలో ఉన్న వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజ‌లి జెమ్స్ రూ. 7,848 కోట్ల విలువైన రుణాల‌ను ఎగ వేసింద‌ని ఆర్థిక శాఖ మంత్రి భ‌గ‌వ‌త్ క‌రాద్ లోక్ స‌భ‌కు లికిత పూర్వ‌కంగా సమాధానం ఇచ్చారు. ఈ అతి పెద్ద రుణ ఎగ‌వేత‌దారుల లిస్టులో త‌ర్వాతి స్థానాల్లో ఎరా ఇన్ ఫ్రా సంస్థ రూ. 5,879 కోట్లు కొల్ల‌గొట్టింది.

రేగో ఆగ్రో రూ. 4,803 కోట్లు ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించిన డేటాను ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. కాన్ కాస్ట్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ రూ. 4,596 కోట్లు ఎగ్గొడితే ఏబీజీ షిప్ యార్డ్ రూ. 3,708 కోట్లు , ఫ్రాస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ రూ. 3,311 కోట్లు, విన్స‌మ్ డైమండ్స్ అండ్ జ్యువెల‌రీ రూ. 2,931 కోట్లు, రోటోమాక్ గ్లోబ‌ల్ రూ. 2,893 కోట్లు, జూమ్ డెవ‌ల‌ప‌ర్లు రూ. 2, 147 కోట్లు కొల్ల‌గొట్టార‌ని తెలిపారు.

బ్యాంకులు రూ. 10.1 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌ను మాఫీ చేశాయ‌ని మంత్రి నిస్సిగ్గుగా ప్ర‌క‌టించారు. భార‌త దేశ‌పు అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రూ. 2 ల‌క్ష‌ల కోట్ల రైట్ ఆఫ్ ల‌తో ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. రూ. 67, 214 కోట్ల‌తో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ త‌ర్వాతి స్థానంలో ఉంది. ప్రైవేట్ రుణ‌దాత‌ల్లో ఐసీఐసీఐ అత్య‌ధికంగా రూ. 50,514 కోట్లు, హెచ్ డీ ఎఫ్ సీ రూ. 34,782 కోట్ల‌ రుణాల‌ను మాఫీ చేసింది.

Also Read : రూ. 11.17 ల‌క్ష‌ల కోట్ల రుణాలు ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!