Smitha Sabharwal Comment : స‌స్పెండ్ స‌రే స‌మ‌స్య మాటేంటి

ఎన్నో ప్ర‌శ్న‌లు ఎన్నో అనుమానాలు

Smitha Sabharwal Comment : స్మితా స‌బ‌ర్వాల్ ఈ పేరు తెలియ‌ని వారంటూ ఉండ‌రు. మోస్ట్ పాపుల‌ర్ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ . తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆమె కీల‌కంగా మారారు. ప‌నితీరుతో ఆక‌ట్టుకున్నారు. ఆయా జిల్లాల్లో ప‌ని చేసిన కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు.

దీంతో స్మితా స‌బ‌ర్వాల్ కు(Smitha Sabharwal)  సీఎం కేసీఆర్ ప్ర‌యారిటీ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో కీల‌క ప‌ద‌విలో నియ‌మించారు. ఆమె భ‌ర్త అకున్ స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు.

గ‌తంలో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచారు. ప్ర‌ముఖ ప‌త్రిక అవుట్ లుక్ ఆమెను కించ ప‌రిచేలా క‌థ‌నం ప్ర‌చురించింది. దీనిపై కోర్టుకు ఎక్కారు. అది కాస్తా స‌ద్దుమ‌ణిగింది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. 

విచిత్రం ఏమిటంటే సీనియ‌ర్ ఆఫీస‌ర్ల‌కు ముఖ్యంగా సీఎంఓలో ప‌ని చేస్తున్న ఉన్న‌తాధికారికి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉంటుంది.

కానీ ఉన్న‌ట్టుండి డిప్యూటీ త‌హ‌శిల్దార్ గా ప‌ని చేస్తున్న ఉద‌య్ కుమార్ రెడ్డి తో పాటు మ‌రొక‌రు హైద‌రాబాద్ లో స్మితా స‌బ‌ర్వాల్  ఉంటున్న ఇంట్లోకి చొర‌బ‌డ్డారు.

ఇదే విష‌యాన్ని స్వ‌యంగా స్మితా స‌బ‌ర్వాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. మ‌హిళ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వీలైతే 100 ఎమ‌ర్జెన్సీ కాల్ చేయాల‌ని సూచించారు.

తాను కేక‌లు వేయ‌డంతో డిప్యూటీ త‌హ‌శిల్దార్ ను( Deputy Tahsildar), వెంట వ‌చ్చిన స్నేహితుడిని సెక్యూరిటీ సిబ్బంది ప‌ట్టుకుని అరెస్ట్ చేశారు. 

చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. ఆపై మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు కూడా జారీ చేశారు. రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని స‌మాచారం.

మ‌రి అంత రాత్రి పూట డిప్యూటీ త‌హ‌శిల్దార్ కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది. ఒక‌వేళ వెళ్లినా ఎందుకు భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకోలేక పోయారు. దీని వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది.

ఇక స్మితా స‌బ‌ర్వాల్(Smitha Sabharwal)  ఆషా మాషీ వ్య‌క్తి కాదు. ఆమె సాక్షాత్తు సీఎం కేసీఆర్ కు కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఇక ఆమెకే ర‌క్ష‌ణ లేక పోతే రాష్ట్రంలో సాధార‌ణ మ‌హిళ‌ల‌కు ఎలా రక్ష‌ణ ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

సెక్యూరిటీ ప‌రంగా టాప్ లో ఉండే ప్రాంతంలో కూడా ఎలా ఆనంద్ కుమార్ రెడ్డి మేడం ఇంట్లోకి వెళ్లాడ‌నేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది. దీనిపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

అయితే ఆనంద్ కుమార్ రెడ్డి చెప్పిన తీరు కూడా వింతగా ఉంది. త‌న ప్ర‌మోష‌న్ , స‌ర్వీస్ విష‌యాల కోసం స్మితా స‌బ‌ర్వాల్ ఇంటికి వెళ్లాన‌ని చెప్పారు. 

పోనీ అంత రాత్రి వేళ అపాయింట్ మెంట్ లేకుండా ఎందుకు వెళ్లాడ‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. జాబ్ కోసం వెళ్లాడ‌ని అంటున్న రెడ్డి అర్ధ‌రాత్రి వెళ్లాల్సిన ప‌నేంటి అనే దానిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. 

ఏది ఏమైనా స్మితా స‌బ‌ర్వాల్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మార‌డం మాత్రం విస్తు పోయేలా చేసింది. అస‌లు తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుందోని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 

ఈ మొత్తం వ్య‌వ‌హారం రాష్ట్రంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యాన్ని..పాల‌నా ప‌ర‌మైన నిర్ల‌క్ష్యాన్ని సూచిస్తోంద‌న్న‌ది వాస్త‌వం.

Also Read : వెల్లువ‌లా పెట్టుబ‌డులు వేలాది కొలువులు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!