Spiritual Book Release : వైష్ణవ భక్తగ్రేశుడు అనంతాళ్వార్
శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి
Spiritual Book Release : తిరుమల – ది హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ముద్రించిన ‘ది డివైన్ హిస్టరీ ఆఫ్ శ్రీ అనంతాళ్వాన్’ అనే తమిళ పుస్తకాన్ని శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి(Chinna Jeyart Swami) తిరుమలలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడారు. తిరుమలలో 1053 – 1138 మధ్య కాలంలో తిరుమల కొండపై శ్రీ వైష్ణవ భక్తగ్రేశుడు అనంతాళ్వార్ అని స్పష్టం చేశారు. ఆ మహానుభావుడి చరిత్రను ఈ గ్రంథం వెలుగులోకి తెస్తోందని స్పష్టం చేశారు.
Spiritual Book Release Viral
అనంతాళ్వాన్ తిరుమల పుణ్య క్షేత్రంలో పుష్ప కైంకర్యం ప్రారంభించారని, పూల తోటలను అభివృద్ధి చేసి, ప్రతి రోజూ ఆలయానికి పూల మాలలు సమర్పించారని అన్నారు. అనంతాళ్వార్ తోటలో జరుపుకునే పవిత్రమైన బాగ్ సవారీ రోజున ఈ పుస్తకం విడుదల చేయబడిందని అన్నారు.
గురువు పట్ల భక్తి, శక్తిని అర్థం చేసు కోవడానికి పుస్తకాన్ని చదవాలని భక్తులకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఈ పుస్తకాన్ని తొలుత తెలుగులో హైదరాబాద్ కు చెందిన భక్తుడు పి.వి. రామి రెడ్డి రాశారు. దీనిని తమిళంలో రాజి రఘునాథన్ అనువదించారు.
ఈ కార్యక్రమంలో ది హిందూ బిజినెస్ లైన్ ఎడిటర్ రఘువీర్ శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & డిస్ట్రిబ్యూషన్) శ్రీధర్ అరనాల, స్పెషల్ పబ్లికేషన్స్ ఇన్ఛార్జ్ ఆర్. శ్రీనివాసన్, క్లస్టర్ హెడ్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) ఎస్డిటి రావు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.
Also Read : WII Team Inspects : అలిపిరి నడక దారి పరిశీలన