Kavya Maran : కావ్య మారన్ పరేషాన్
మరోసారి హైదరాబాద్ ఓటమి
Kavya Maran : ఐపీఎల్ 16వ సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. గత సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన ఆ జట్టు ఈసారైనా సత్తా చాటుతుందని అనుకున్నారు. కానీ కొన్ని మ్యాచ్ లలో గెలుపొందినా చివరకు ఆఖరి ప్లేస్ లో నిలిచింది. ఈసారి మినీ ఐపీఎల్ వేలం పాటలో భారీ ధరకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ప్రధానంగా ఆ జట్టుకు సిఇఓగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ వారసురాలు కావ్య మారన్ ఫుల్ ఫోకస్ పెట్టింది.
జట్టులో కీలక ఆటగాళ్లను తీసుకుంది. అంతే కాదు కెప్టెన్ ను మార్చింది. ఆపై జట్టుకు దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాను కోచ్ గా తీసుకుంది. కానీ జట్టు రాత మారలేదు. దాని ఆట తీరులో ఎలాంటి ప్రగతి కనిపించ లేదు. కొన్ని సార్లు ఐపీఎల్ లీగ్ లో మెరిసినా ఆ తర్వాత యధావిధిగా పరాజయం మూటగట్టుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్.
తాజాగా లీగ్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేసింది. ఒక రకంగా ఇది భారీ స్కోర్. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 2 వికెట్లు కోల్పోయి సునాయస విజయాన్ని స్వంతం చేసుకుంది. ఇక హైదరాబాద్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ దుమ్ము రేపాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఇంత చేసినా తన జట్టు ఓడి పోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది కావ్య మారన్.
Also Read : PBKS vs RR IPL 2023