Sri Lanka Crisis : పాలకుల వైఫల్యం శ్రీలంక (Sri Lanka) ప్రజల పాలిట శాపంగా మారింది. అసంబద్ధ నిర్ణయాలు ఆ దేశాన్ని నిట్ట నిలువునా ముంచే ప్రయత్నం చేశాయి. ముందు చూపు లేని నాయకత్వం ఈ దుస్థితికి ప్రధాన కారణం.
ప్రస్తుతం శ్రీలంక (Sri Lanka) పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో పర్యటించిన భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కంట తడి పెట్టారు.
సాధారణ పౌరులు, ప్రజానీకం ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.
మందులు లేవు, 10 గంటలకు పైగా విద్యుత్ కోతతో అల్లాడుతోంది.
విదేశీ కరెన్సీ కొరత కారణంగా ముఖ్యమైన దిగుమతుల కోసం శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం చెల్లించలేక చేతులెత్తేసింది.
ఇది ప్రాణాలను రక్షించే మందుల నుంచి సిమెంట్ దాకా అన్నింట్లోనూ తీవ్ర కొరతకు(Sri Lanka Crisis) దారి తీసింది.
తాగేందుకు నీళ్లు దొరకడం లేదు. తినేందుకు తిండి అందుబాటులో లేకుండా పోతోంది.
ఆస్పత్రులు (Hospitals) మూసి వేస్తున్నారు. పూర్తిగా ఎమర్జెన్సీ ప్రకటించే దుస్థితికి దేశం దిగజారింది.
శ్రీలంక (Sri Lanka) వాసులు ఇంధనం కోసం పగటి పూట క్యూలలో నిలిచి ఉంటున్నారు. దొరకక పడి పోతున్నారు.
ఇక సాయంత్రం వేళల్లో కొవ్వొత్తులు వెలిగించి బతుకుతున్నారు. అత్యంత దారుణమైన , హృదయ విదారకమైన దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
తెల వారక ముందే ఇంధనం కోసం బారులు తీరి నిలుచున్నారు.
ప్రభుత్వం పూర్తి బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తోందంటూ ప్రజలు మండి పడుతున్నారు. ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎలా పోషించాలనే దానిపై చింతిస్తున్నారు.
పేద కుటుంబాలు ఆకలి కేకలతో అలమటిస్తున్నాయి. చికిత్స అందక, ఆకలి తీర్చు కోలేక మూర్చతో పడి పోతున్నారని ఆవేదన (Sri Lanka Crisis) చెందుతున్నారు.
తాను ఏమీ తిన లేదని కానీ కనీసం బిడ్డల ఆకలి తీర్చేందుకు సైతం తన వద్ద ఏమీ లేదని రోదిస్తోంది. ఇలాంటి దృశ్యాలు, రోదనలు కోకొల్లలు. రోజూ వారీ కూలీలను రవాణా చేసే బస్సులు పని లేకుండా ఉన్నాయి.
కొన్ని ఆస్పత్రులు (Hospitals) సాధారణ శస్త్ర చికిత్సలను నిలిపి వేశాయి. పాఠశాలలు పూర్తిగా మూసి వేశారు. గత 60 ఏళ్లలో శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
ఇకనైనా యావత్ ప్రపంచం శ్రీలంక (Sri Lanka) ను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేక పోతే ఆకలి చావులతో దేశం అతలాకుతలం కానుంది.
Also Read : ఐపీఎల్ మీడియా రైట్స్ రూ. 50 వేల కోట్లు