TS Summer Holidays : ఏప్రిల్ 25 నుంచి బడులకు సెలవులు
మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు
TS Summer Holidays : ఎండా కాలం వచ్చేసింది. ఇక పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎండల నుంచి రక్షించేందుకు గాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బడులలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు మాత్రమే ఉంటాయని తెలిపింది.
ఈ తరగతులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహిస్తారని పేర్కొంది. ఇక ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆఖరి పని రోజుగా ఏప్రిల్ 24 అని వెల్లడించింది. వచ్చే ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు(TS Summer Holidays) ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అన్ని స్కూళ్లు వీటిని కచ్చితంగా పాటించాల్సిందేనని వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో 10వ తరగతి విద్యార్థులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఎందుకంటే వారు పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకుని వారికి ప్రత్యేక తరగతులు తీసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఏప్రిల్ 10 నుంచి 17 వ తేదీ వరకు ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు ఆయా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయాల్సి ఉంటుంది. టీచర్లు ఇదే పనిలో నిమగ్నం అయ్యారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వారి ప్రచారం కూడా జోరందుకుంది. ఎండల వేళ పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత హెచ్ఎంలు, ఎస్ఓలపై ఉంది.
Also Read : వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న మహిళలు