ధోనీ, గవాస్కర్ ఇద్దరూ క్రికెట్ దిగ్గజాలు. ఎవరికి వారే. కానీ ఊహించని రీతిలో చెన్నైలోని చెపాక్ లో కామెంటేటర్ గా ఉన్న గవాస్కర్ తనంతకు తానుగా వెళ్లి ధోనీ తో తన షర్ట్ పై సంతకం తీసుకున్నాడు. ఇది మరుపురాని సన్నివేశం. యావత్ క్రీడా లోకం విస్తు పోయింది. సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. నా చివరి క్షణాల్లో అంటూ సన్నీ భావోద్వేగానికి లోనయ్యాడు. ధోనీపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు.
ట్విట్టర్ వేదికగా ఈ విషయం గురించి పంచుకున్నాడు. ఐపీఎల్ లో ఆటగాడిగా ఇప్పటి వరకు మాత్రమే ఫ్యాన్స్ గుర్తు పెట్టుకున్నారు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా ఉన్నాడు. ఇదే ఆఖరి సీజన్ అని ప్రకటించాడు. ఈ సందర్బంగా చెపాక్ స్టేడియం మొత్తం ధోనీ నినాదాలతో హోరెత్తి పోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత ధోనీకి యావత్ స్టేడియం చప్పట్లతో స్వాగతం పలికింది. అంతకు మించి ఆదరణ లభించడంతో ధోనీ కూడా ఏమీ అన లేక పోయాడు.
ఉన్నట్టుండి తట్టుకోలేక గవాస్కర్ తను పరుగెత్తుకుంటూ వెళ్లి జార్కండ్ డైనమెట్ సంతకం తీసుకోవడం ఆశ్చర్య పరిచింది. ఆనాడు కపిల్ దేవ్ సారథ్యంలో మొదటిసారిగా భారత్ కు వరల్డ్ కప్ తీసుకు వచ్చిన జ్ఞాపకం నా కళ్ల ముందు కదలాడిందని అన్నాడు గవాస్కర్. ఆరోజు కపిల్ దేవ్ కప్ ను ఎత్తడం, 2011లో శ్రీలంకపై ట్రోఫీ గెలిచేందుకు కావాల్సిన సిక్స్ కొట్టాక ధోనీ బ్యాటన్ ఊపడం తనకు ఇష్టమని తెలిపాడు.
