న్యూఢిల్లీ : ఓ వైపు మోదీ సర్కార్ పై ఇంకో వైపు సీఈసీ, సుప్రీంకోర్టుపై యుద్దం ప్రకటించిన సమయంలో ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. తాజాగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ నిరసన చేపట్టింది. ఈ సందర్బంగా ఢిల్లీలో గర్భిణీ జర్నలిస్టును రాహుల్ గాంధీ తోసేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి బాధిత జర్నలిస్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసింది. దీంతో సదరు జర్నలిస్టుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా తాజాగా రాహుల్ గాంధీ గర్భిణీ జర్నలిస్ట్ పై దాడికి దిగారంటూ రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ దావా దరఖాస్తును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది . అక్టోబర్ 12న కోర్టు ప్రాంగణంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మూడు నెలల గర్భవతిగా ఉన్నట్లుగా చెబుతున్న ఒక మహిళా జర్నలిస్టును తోసేశారని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆరోపణల ప్రకారం, భారత ఎన్నికల సంఘం (ECI)ను సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేయడానికి రాహుల్ గాంధీ , ఇతర ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారించ బడలేదు. కోర్టు విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరో వైపు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన రాహుల్ గాంధీని , ఆయన ప్రవర్తనను చూసి స్పందించారు కోర్టులో. ఈ సందర్బంగా సుప్రీంకోర్టును ఎవరూ భయపెట్ట లేరని అన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమను ఎవరూ జడ్జ్ చేయలేరంటూ స్పష్టం చేశారు.
