Teenmar Mallanna : కాంగ్రెస్ గూటికి తీన్మార్ మల్లన్న
పార్టీలోకి ఏఐసీసీ ఆహ్వానం
Teenmar Mallanna : న్యూఢిల్లీ – ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రజల తరపున గత కొన్నేళ్లుగా తన వాయిస్ ను వినిపిస్తూ వచ్చారు. విచిత్రం ఏమిటంటే ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. కానీ అక్కడ తనకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వెంటనే కాషాయానికి కటీఫ్ చెప్పారు.
Teenmar Mallanna Joined in Congress
తను మేడ్చల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నం చేశారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాడు. ఒకానొక దశలో గెలిచినంత పని చేశారు. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి చుక్కలు చూపించాడు.
ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అసలు పేరు చింతపండు నవీన్. తను తొలుత వీ6 ఛానల్ లో పని చేశారు. తీన్మార్ మల్లన్నగా పేరు పొందారు. తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో మల్లనను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీపీసీసీ కార్యనిర్వాహక ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , తెలంగాణ ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే , పార్టీ పరిశీలకుడు బోస్ రాజు , సీడబ్ల్యూసీ సభ్యుడు గురు దీప్ సిప్పల్ , సెక్రటరీ పీసీ విష్ణు నాథ్, రోహిత్ చౌదరి పాల్గొన్నారు.
Also Read : Trivikram Srinivas Comment : కలం బలం త్రివిక్రమ్