Telangana BJP Comment : పాగా వేసేనా పవర్ లోకి వచ్చేనా
ఆక్టోపస్ లా విస్తరించిన బీజేపీ
Telangana BJP : తెలంగాణలో ఎన్నికల యుద్దం కొత్త రూపు సంతరించుకుంది. ప్రధాన పార్టీల మధ్య పోరు ఉత్కంఠను రేపుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. నిన్నటి దాకా కొంత ప్రచారంలో వెనుకంజలో ఉన్నా ఇప్పుడు దూకుడు పెంచింది భారతీయ జనతా పార్టీ(BJP). ఆ పార్టీకి ఫుల్ జోష్ తీసుకు వచ్చే పనిని భుజాన వేసుకున్నారు ఈటల రాజేందర్, బండి సంజయ్. మరో వైపు చాప కింద నీరులా ప్రచారం చేపట్టారు కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు దిగ్గజ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు. ఒకరి తర్వాత మరొకరు జల్లెడ పడ్డారు. ఇప్పటి దాకా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ, ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సీనియర్లు ఫోకస్ పెట్టారు. విజయ సంకల్ప సభలతో హోరెత్తిస్తున్నారు. ఉత్తర , దక్షిణ తెలంగాణలో ఎలాగైనా సరే సాధ్యమైనన్ని సీట్లను కైవసం చేసుకోవాలని కంకణం కట్టుకుంది ఆ పార్టీ.
Telangana BJP Comment Viral
అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ఆ పార్టీ నానా తంటాలు పడుతోంది. అయితే వ్యూహాత్మకంగా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న, అత్యధిక సామాజిక వర్గంగా పేరు పొందిన ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని సాక్షాత్తూ ప్రధాని ప్రకటించారు. ఇది ఓట్లను చీల్చుతుందని భావిస్తోంది ఆ పార్టీ. మరో వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీసీ సీఎం అంటూ ముందుకు తీసుకు వచ్చింది. దీంతో అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్న ఈ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లను చీల్చే ఛాన్స్ లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది బీజేపీ. ఇదే సమయంలో ఎంఐఎం కూడా లోపాయికారిగా కమలానికి మద్దతు ఇస్తోందన్న అపప్రదను మూటగట్టుకుంటోంది.
దీనిని అధిగమించేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ(BJP). రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో హోరెత్తిస్తుండడం పార్టీకి అదనపు బలాన్ని ఇస్తోందని భావిస్తోంది. అయితే కనీసం రాష్ట్రంలో పవర్ లోకి రాక పోయినా కింగ్ పిన్ గా మారాలన్నది ట్రబుల్ షూటర్ ప్లాన్. ఆ మేరకు సినీ రంగానికి చెందిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను కూడా ఉపయోగించు కుంటోంది. ఆయన కూడా విస్తృతంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి. మొత్తంగా ఓ వైపు కాంగ్రెస్ ఇంకో వైపు బీఆర్ఎస్ , బీఎస్పీ ని తట్టుకుని డిసైడ్ చేసే స్థితిలోకి రావాలని చూస్తోంది బీజేపీ. ఒకవేళ హంగ్ గనుక ఏర్పడితే అప్పుడు కమలం చేతిలో అధికారం వచ్చి తీరుతుంది. ఇక తెలంగాణలో ఓటర్లు బయట పడడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వెళుతుందనే దానిపై మొత్తం ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది వాస్తవం. అంత దాకా చూడాలంటే ..డిసెంబర్ 3 దాకా వేచి చూడాల్సిందే.
Also Read : Revanth Reddy Comment : రేవంత్ జోరు కాంగ్రెస్ హుషారు