Yuva Galam Support : ఓవెల్ మైదానంలో ‘యువ గళం’ హవా
నారా లోకేష్ యాత్రకు యుకె యువత సపోర్ట్
Yuva Galam Support : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం(Yuva Galam) పేరుతో పాద యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన చేపడుతున్న యాత్ర రాయల సీమ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 119 రోజులు యాత్ర పూర్తి చేసుకుంది. ఇవాల్టితో 120వ రోజు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు నారా లోకేష్.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. భారత , ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ ఓవెల్ మైదానంలో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ జరుగుతోంది.
మైదానంలో తెలుదేశం పార్టీకి చెందిన అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హల్ చల్ చేశారు. యూకే తెలుగు యువత యువ గళం(Yuva Galam) జెండాలను పట్టుకుని దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా జై నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి యువ గళంతో కూడిన జెండాలను మైదానంలో ప్రదర్శించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి ఈ ఫోటోలు.
తమకు ఎనలేని మద్దతు తెలుపుతున్న తెలుగు యువతకు, ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు తెలిపింది తెలుగుదేశం పార్టీ. విషయం తెలుసుకున్న నారా లోకేష్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : Appalayagunta : ఘనంగా వేంకటేశ్వరుడి రథోత్సవం