Ian Botham : భారత్ లో టెస్టు క్రికెట్ కు నిరాదరణ
ఆవేదన వ్యక్తం చేసిన ఇయాన్ బోథమ్
Ian Botham : మాజీ క్రికెటర్ , ప్రముఖ క్రికెటర్ ఇయాన్ బోథమ్(Ian Botham) సంచలన కామెంట్స్ చేశాడు టెస్టు క్రికెట్ గురించి. ప్రధానంగా భారత దేశంలో రోజు రోజుకు టెస్ట్ క్రికెట్ ను పట్టించు కోవడం లేదని ఆవేదన చెందాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) ను ఎక్కువగా ఆదరిస్తున్నారని పేర్కొన్నాడు. దీని వల్ల ఆదాయం భారీగా బీసీసీఐకి సమకూరుతోందని కానీ ఇలాగే ప్రాధాన్యత ఇస్తూ పోతే రాబోయే రోజుల్లో టెస్టు క్రికెట్ కనిపించక పోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించాడు.
ఎన్ని పొట్టి ఫార్మాట్ లు వచ్చినా టెస్టు క్రికెట్ అలాగే ఉంటుందన్నారు. ప్రధానంగా బీసీసీఐ మరోసారి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు ఇయాన్ బోథమ్. కొన్నేళ్ల నుంచి క్రికెట్ కొనసాగుతోంది. అసలు క్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లండ్. ఇప్పటికీ ఇంగ్లండ్ లో టెస్టు మ్యాచ్ లకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారని చెప్పాడు. కానీ భారత్ లో అలాంటి సీన్ కనిపించడం లేదన్నారు. దీనిపై బీసీసీఐ ఎక్కువగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశాడు.
ఒక రకంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఇయాన్ బోథమ్(Ian Botham). ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఎవరు ఇండియాకు వెళ్లినా అక్కడ టెస్టు మ్యాచ్ లను చూసే స్థితిలో లేరన్నాడు. అదంతా ఐపీఎల్ వల్ల వచ్చిన ఇబ్బంది అని మండిపడ్డాడు ఇయాన్ బోథమ్. ప్రస్తుతానికి బాగుంటుంది కానీ ఇది ఇలా ఎంత కాలం ఉంటుందని ప్రశ్నించాడు మాజీ క్రికెటర్. ప్రతి ఆటగాడు టెస్టు మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నం చేయాలని కోరాడు బోథమ్.
Also Read : క్రీడా రంగానికి రూ. 3,397 కోట్లు