RBI Adani : బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడగా ఉంది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన
RBI Adani : అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు అదానీ గ్రూప్(Adani) షేర్లు రోజు రోజుకు దిగజారుతున్నాయి. నిన్నటి దాకా ప్రపంచ కుబేరుల్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ 2వ స్థానంలో ఉండగా షేర్లు ఢమాల్ అనడంతో ఏకంగా 22వ స్థానానికి పడి పోయాడు. ఇక అదానీ గ్రూప్ కు ప్రభుత్వ బ్యాంకులు భారీ ఎత్తున రుణాలుగా ఇచ్చాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇక ఇప్పటికే జీవిత బీమా సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఇన్వెస్ట్ చేశాయి అదానీ గ్రూప్ లో . దీనిపై పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది.
ఈ మేరకు శనివారం కీలక ప్రకటన చేసింది. భారత బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చిన నష్టం ఏమీలేదని, అది పూర్తిగా నియంత్రణలోనే ఉందని పేర్కొంది ఆర్బీఐ. మూల ధన సమృద్ది, లిక్విడిటి, ప్రొవిజన్ కవరేజ్ , లాభదాయకతకు సంబంధించిన వివిధ పారమితులు ఆరోగ్య కరమైనవని అదానీ గ్రూప్ సంస్థల స్టాక్ లు పతనమైన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వ్యాఖ్యలు చేసింది. తాము అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస.
ఆర్బీఐ ప్రస్తుత అంచనా ప్రకారం బ్యాంకింగ్ రంగం స్థితి స్థాపకంగా , స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. ఎల్ఐసీ పెట్టుబడిదారులు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Also Read : ఆవిరవుతున్న సంపదతో ఆగమాగం