Surya Kumar Yadav Pollard : వీడ‌ని బంధం ఆట శాశ్వ‌తం

సూర్య కుమార్..పొలార్డ్ ఫోటోలు హ‌ల్ చ‌ల్

Surya Kumar Yadav Pollard  : సూర్య కుమార్ యాద‌వ్ ఇపుడు హాట్ టాపిక్ గా మారారు. ప్ర‌స్తుతం వెస్టిండీస్ తో జ‌రిగిన సీరీస్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది సీరీస్ తో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక‌య్యాడు.

విచిత్రం ఏమిటంటే వెస్టిండీస్ కెప్టెన్ కీర‌న్ పొలార్డ్ , సూర్య కుమార్ యాద‌వ్ (Surya Kumar Yadav)ల మ‌ధ్య ఎడ‌తెగ‌ని బంధం ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి కొన్నేళ్ల పాటు ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో క‌లిసే ఆడుతున్నారు.

దేశాలు వేరైనా, జాతులు వేరైనా, మ‌తాలు వేరైనా త‌మ స్నేహం మాత్రం ప‌దిలం అంటున్నారు. విచిత్రం ఏమిటంటే పొలార్డ్ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు కెప్టెన్. ఇక సూర్య కుమార్ యాద‌వ్ భార‌త క్రికెట్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. విండీస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. విజ‌యం సాధించిన అనంత‌రం సూర్య కుమార్ యాద‌వ్ ను ప్ర‌త్యేకంగా అభినందించాడు పొలార్డ్.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు పొలార్డ్ సోద‌రుడు లాంటి వాడ‌ని పేర్కొన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. తామిద్దరి మ‌ధ్య ఎన‌లేని బంధం ఉంద‌ని తెలిపాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. పొలార్డ్ , సూర్య యాద‌వ్ ల ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇద్ద‌రూ ఆట‌గాళ్ల‌ను ముండై ఇండియ‌న్స్ చేజిక్కించుకుంది. ఇత‌రులు బాగా ఆడుతుంటే ద్వేషించే స్వ‌భావం క‌లిగి ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో కీర‌న్ పొలార్డ్ , సూర్య కుమార్ యాద‌వ్ ల మ‌ధ్య బంధం స్పూర్తి దాయ‌కంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Also Read : స‌త్తా చాటారు సీరీస్ గెలిచారు

Leave A Reply

Your Email Id will not be published!