హైదరాబాద్ : భారత దేశంలో సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత సంపన్నులైన నటీ నటుల జాబితా వెల్లడైంది. ఈ లిస్టులో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటులు టాప్ లో చోటు దక్కించు కోవడం విశేషం. ఇక అత్యంత సంపన్నులైన నటుల జాబితాలో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ ఉన్నారు. సుమారు రూ. 10,000 కోట్ల నికర ఆస్తి విలువతో బాలీవుడ్ కు చెందిన టాప్ హీరో షారుఖ్ ఖాన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. రూ. 5,000 కోట్ల ఆస్తి విలువతో తెలుగు సూపర్ స్టార్ అక్కినేని నాగార్జున రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత సంపన్నులైన టాప్ 10 సినీ ప్రముఖుల జాబితాలో నలుగురు తెలుగు తారలు చోటు దక్కించు కోవడం ద్వారా 2026 నాటి అత్యంత సంపన్న నటుల జాబితాలో టాలీవుడ్ తన బలమైన ముద్ర వేసింది.
బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి నటుల కంటే ముందు నిలవడం ద్వారా, ఈ జాబితాలో అత్యంత సంపన్న తెలుగు నటుడిగా నాగార్జున నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి రూ. 1,700 కోట్ల ఆస్తి విలువతో ఎనిమిదవ స్థానంలో ఉండగా, వెంకటేష్ దగ్గుబాటి సుమారు రూ. 1,650 కోట్లతో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. రూ. 1,400 కోట్ల ఆస్తి విలువతో రామ్ చరణ్ టాప్ 10 జాబితాను పూర్తి చేశారు. భారతదేశంలోని అత్యంత సంపన్నులైన 10 మంది నటుల పూర్తి జాబితాలో షారుఖ్ ఖాన్ రూ. 10,000 కోట్లు, నాగార్జున అక్కినేని రూ. 5,000 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ. 4,000 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్లు, హృతిక్ రోషన్ రూ. 2,500 కోట్లు, అక్షయ్ కుమార్ రూ. 2,300 కోట్లు, అమీర్ ఖాన్ రూ. 1,800 కోట్లు, చిరంజీవి రూ. 1,700 కోట్లు, వెంకటేష్ దగ్గుబాటి రూ. 1,650 కోట్లు, రామ్ చరణ్ రూ. 1,400 కోట్లతో నిలిచారు.