TPCC NRI Cell : టీపీసీసీ ఎన్ఆర్ఐల సంబురాలు
రేవంత్ రెడ్డికి అభినందనలు
TPCC NRI Cell : యునైటెడ్ కింగ్ డమ్ – తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. పార్టీ తరపున సీఎల్పీ లీడర్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డిని(Revanth Reddy) నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆయనను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది ఏఐసీసీ హై కమాండ్.
TPCC NRI Cell Happy Moments
రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరడం, పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతో ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబురాలలో మునిగి పోయారు. తాజాగా టీపీసీసీ ఎన్ఆర్ఐ యూకే సెల్ ఆధ్వర్యంలో లండన్ లో ఉత్సవాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా యూకే కన్వీనర్ గంప వేణు గోపాల్ రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేయడం పట్ల ఏఐసీసీ హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐఓసీ మెంబర్ సుభాష్ బాబు మాట్లాడారు. దొరల పాలన అంతమైందన్నారు. సామాజిక తెలంగాణ ఇక రాబోతోందన్నారు. ఆ నమ్మకం తమకు ఉందన్నారు.
మంత్రివర్గంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్యకు కేబినెట్ లో చోటు కల్పించాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చినందుకు, రేవంత్ ను సీఎం చేసినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
Also Read : Revanth Reddy : తుఫాను ప్రభావం అప్రమత్తత అవసరం