Twitter Logo Comment : అయ్యో పిట్ట‌కూత‌కు ఎంత క‌ష్టం

ఎలోన్ మ‌స్క్ నిర్వాకంపై ఆగ్ర‌హం

Twitter Logo Comment : ఏమిటీ పిట్ట కూత అనుకుంటున్నారా. జాక్ డార్సీ మ‌దిలో మెదిలిన ట్విట్ట‌ర్ ఉన్న‌ట్టుండి చేజారి పోతోందా అన్న అనుమానం క‌లుగుతోంది. టెక్నాల‌జీలో లెక్క‌లేన‌న్ని మార్పులు చోటు చేసుకున్నాయి. నిత్యం మార్పున‌కు సంకేతం. కానీ ఎన్ని సామాజిక మాధ్య‌మాలు వ‌చ్చినా, కొత్త‌గా రూపు దిద్దుకున్నా ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ లేక పోయాయి ట్విట్ట‌ర్ పై. ప్ర‌పంచాన్ని ఒకే గొడుగు కింద‌కు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ట్విట్ట‌ర్ దే. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఎందుకంటే దానిని వాడ‌కుండా, ఉప‌యోగించ‌కుండా, త‌మ అభిప్రాయాల‌ను పంచుకోకుండా, ఆలోచ‌న‌ల‌తో సంభాషించ‌కుండా ఉండ‌లేరు. అంత‌లా జ‌న బాహుళ్యంలోకి చొచ్చుకు పోయింది. ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌ను తాము ప్ర‌తి రోజూ , ప్ర‌తి క్ష‌ణం ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే వ‌చ్చారు. ఒక‌రా ఇద్ద‌రా కోట్లాది మంది ట్విట్ట‌ర్ లో స‌భ్యులై పోయారు. క‌ల‌ల‌కు రెక్క‌లు తొడుగుతూ గుండెల్ని మీటుతున్నారు. ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, మ‌రెన్నో సంఘ‌ట‌న‌ల‌కు, ఇంకెన్నో పోరాటాల‌కు, ఉద్య‌మాల‌కు వేదిక‌గా నిలిచింది ఈ పిట్ట‌కూత (ట్విట్ట‌ర్).

Twitter Logo Comment Raisers

ట్విట్ట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే(Twitter Logo Comment). ఎందుకంటే దానికి చెప్ప‌లేనంత చ‌రిత్ర ఉంది. ఓ ఫ్రెండ్ గా ప‌ల‌క‌రిస్తుంది. ఓ తల్లిగా లాలిస్తుంది..ఓ తండ్రిగా భ‌రిస్తుంది..ఓ గురువుగా దిశా నిర్దేశం చేస్తుంది..అందుకే ట్విట్ట‌ర్ కు అంత‌టి ఆద‌ర‌ణ‌. మ‌న‌కు తోచింది రాసుకోవ‌చ్చు. వాటిని పంచుకోవ‌చ్చు. వీలైతే కామెంట్స్ కూడా చేయొచ్చు..ఇందులో ఫోటోలు, వీడియోలు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు..మ‌రెన్నో వింత‌లు. ట్విట్ట‌ర్ సోష‌ల్ మీడియా సైట్ మాత్ర‌మే కాదు..స‌మ‌స్త మాన‌వాళి మ‌ధ్య‌న విడ‌దీయ‌లేని వార‌ధిని ఏర్ప‌ర్చిన గొప్ప మాధ్య‌మం..అరుదైన విశ్వ వేదిక‌. కానీ ఉన్న‌ట్టుండి పిట్ట కూత‌కు క‌ష్టం వ‌చ్చి ప‌డింది. ప్ర‌పంచ కుబేరుడు, టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ పై క‌న్నేశాడు.

ఆపై దానిని టేకోవ‌ర్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ట్విట్ట‌ర్ రూపు రేఖ‌లు పూర్తిగా మారి పోయాయి. దాని ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది. చివ‌ర‌కు ట్విట్ట‌ర్ కోసం శాయ‌శ‌క్తులా కృషి చేస్తూ వ‌చ్చిన వారిని ప‌క్క‌న పెట్టాడు. కీల‌క మార్పులు చేశాడు. చివ‌ర‌కు ట్విట్ట‌ర్ కు లేబుల్ గా, బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న పిట్ట కూత లోగోను కూడా మార్చేశాడు ఎలోన్ మ‌స్క్. ప్ర‌స్తుతం త‌న అస‌లైన రూపాన్ని కోల్పోవ‌డాన్ని నెటిజ‌న్లు జీర్ణించుకోలేక పోతున్నారు. అయ్యో అని వాపోతున్నారు..భావోద్వేగానికి లోన‌వుతున్నారు..కంట త‌డి పెడుతున్నారు. పాపం పిట్ట కూత ఇక క‌నిపించ‌దు ట్విట్ట‌ర్లో..అది లేకుండా ఊహించ‌లేం. ఏది ఏమైనా బంధం విలువ తెలియాలంటే కోల్పోయిన‌ప్పుడే అర్థం అవుతుంది. ఫ‌క్తు వ్యాపార దృక్ఫథంతో ఆలోచించే ఎలోన్ మ‌స్క్ నుంచి ఇంత‌కంటే ఇంకేం ఆలోచించ గ‌లం.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 5 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!