#UlavaCharu : కృష్ణా జిల్లా ఫేమస్ వంటకం ఏమిటో తెలుసా ?

ఉలవచారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Ulava Charu : ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పాతకాలం రోజుల్లో ఉలవచారు తయారు చేసుకునే వారు. కానీ ఇప్పుడు అందరూ బయట కొనుక్కుని తింటున్నారు. అలా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని తింటే ఆ రుచే వేరు. ఉలవచారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఉలవచారు తయారు చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్ధాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

ఉలవలు – 1 కప్పు
చింతపండు – కొద్దిగా
పచ్చిమిర్చి – 3
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 4 రెబ్బలు
జీలకర్ర – అర టీ స్పూను
ఆవాలు – 1 టీ స్పూను
బెల్లం తరుగు – 1 టీ స్పూను
ధనియాలపొడి – 1 టేబుల్‌ స్పూను
జీలకర్ర – 1 టీ స్పూను
వెలుల్లి రేకలు – 6

తయారుచేయు విధానం :

ఉలవల్ని ముందురోజు రాత్రే 8 కప్పుల నీటిలో నానబెట్టి మరుసటిరోజు ఉదయం మెత్తగా ఉడికించి వడకట్టాలి. తర్వాత అరకప్పు ఉలవలను మాత్రమే తీసుకుని పేస్టులా రుబ్బుకోవాలి. ఒక పాన్ తీసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, వేగించి వడకట్టిన నీరు పోసి మరిగించాలి. ఒక పొంగు రాగానే పసుపు, ఉప్పు, బెల్లం, రసం పొడి, ఉలవల పేస్టు, చింతపండు గుజ్జు, ధనియాలపొడి కలిపి చిన్నమంటపై 20 నిమిషాలు మరిగించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఉలవచారు రెడీ అయినట్లే. దీనిని వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

No comment allowed please