Uma Bharti : కాషాయంపై ఫైర్ బ్రాండ్ కన్నెర్ర
పక్కన పెడుతున్నారంటూ ఫైర్
Uma Bharti : మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఉమా భారతి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తనను పార్టీ పట్టించు కోవడం లేదంటూ ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని ఉమా భారతి ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మద్యాన్ని నిషేధించాలని, గంగా కినారే పేరుతో కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు.
కానీ ఈరోజు వరకు పార్టీ పరంగా మద్దతు లభించడం లేదంటూ మండిపడ్డారు. ఒక రకంగా కన్నెర్ర చేశారు. ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడ జేపీ నడ్డాకు కూడా లేఖ రాశాననిని అక్కడి నుంచి స్పందన రాలేదని వాపోయారు ఉమా భారతి(Uma Bharti) . ఇదిలా ఉండగా తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం లేదని పేర్కొన్నారు.
అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒకే మద్యం పాలసీ ఉండాలని తాను కోరుతున్నానని ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించానని తెలిపారు. కానీ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడేందుకు పోనీ చర్చించేందుకు సైతం ముందుకు రాక పోవడం తనను విస్తు పోయేలా చేసిందని పేర్కొన్నారు.
ప్రధానంగా ఆమె మధ్యప్రదేశ్ లో అమలులో ఉన్న మద్య నిషేధంపై భగ్గుమన్నారు. వచ్చే నెల 8వ వరకు తాను మౌనంగా ఉంటానని ఆ తర్వాత తాను నోరు విప్పుతానని హెచ్చరించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక రకంగా ఆల్టిమేటం ఇచ్చారు ఉమా భారతి(Uma Bharti) . ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
మరి జేపీ నడ్డా నవ్వి ఊరుకుంటారా లేక చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో బీజేపీ లిస్టు రిలీజ్