ED Vijay Devarakonda : ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
లైగర్ మూవీ వ్యవహారంపై ఆరా
ED Vijay Devarakonda : నటుడు విజయ్ దేవరకొండ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పాటు నిర్మాతగా ఉన్న నటి చార్మిని కూడా ఇప్పటికే విచారించారు. పూరీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, పూనమ్ పాండే, రమ్యకృష్ణ నటించారు.
భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. లైగర్ మూవీ ఆర్థిక వ్యవహారాలపై విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. కొందరు రాజకీయ నాయకులు ఈ చిత్రానికి వెనుక నుంచి ఇన్వెస్ట్ చేసినట్లు విమర్శలు వచ్చాయి.
ఈ వ్యవహారం వెనుక మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. నటుడు విజయ్ దేవరకొండకు (ED Vijay Devarakonda) ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే వెంటనే హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇందులో ఎలాంటి మినహాయింపు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
లైగర్ సినిమా షూటింగ్ సందర్భంగా నటుడు, దర్శకుల అకౌంట్లలో డబ్బులు ఎవరు జమ చేశారు. ఎక్కడెక్కడి నుండి డబ్బులు వచ్చాయని ఆరా తీసినట్లు సమాచారం. ఇక లైగర్ కు సంబంధించి విదేశాల్లో షూటింగ్ జరిగింది. అక్కడ ఎవరు చెల్లించారు ఖర్చులను. నటించిన నటీనటులకు ఎవరు సాయం చేశారని ఆరా తీసినట్లు టాక్.
ఆయా బ్యాంకుల ఖాతాల నుంచి ఎవరెవరికి చెల్లించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పరిశీలించినట్లు సమాచారం. లైగర్ చిత్రం కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు , విదేశాలకు ఏ రూపకంగా చెల్లించారని కూడా ఈడీ కోరింది.
Also Read : ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ బక్వాస్ – రౌత్